Hartalika Teej 2022: ఇవాళ దేశవ్యాప్తంగా హర్తాళికా తీజ్‌ను జరుపుకుంటున్నారు. ఈరోజున శివపార్వతులను, వినాయకుడిని పూజిస్తే మీ కోరికలు నెరవేరుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని వివాహిత స్త్రీలు ఈ వ్రతాన్ని (Hartalika Teej 2022) ఆచరిస్తారు. పెళ్లికాని అమ్మాయిలు మంచి వరుడు కోసం ఈ పండుగను జరుపుకుంటారు. హర్తాళికా తీజ్ రోజున ఈ పరిహారాలు చేయడం ద్వారా మీ లైఫ్ ఆనందంగా ఉంటుంది.
హర్తాళికా తీజ్ రోజున ఈ చర్యలు చేయండి
1. పెళ్లికాని యువతలు కోరుకున్న వరుడు రావాలంటే ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ రోజున నల్లమట్టితో శివుడి విగ్రహం లేదా శివలింగాన్ని తయారుచేసి పూజించాలి. తర్వాత శివుడికి బిల్వపత్రాలు, అక్షత, గంధం, పూలు మెుదలైన వాటిని సమర్పించి పూజించండి. శివయ్యతోపాటు పార్వతీ, గణేశుడిని పూజించండి. దీంతోపాటు ఈ మంత్రాన్ని పఠించండి.
హే గౌరీ శంకర అర్ధాంగినీ యత్వం శంకర ప్రియం
తథా మం కురు కల్యాణి కంటకాంత సుదుర్లభమ్.
2. వివాహిత స్త్రీలు.. వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే ఈరోజు పార్వతీ పరమేశ్వరులను ఆరాధించాలి. అంతేకాకుండా పార్వతీ దేవికి ఎరుపు రంగు చున్రీని సమర్పించండి. పూజ సమయంలో ''ఓం గౌరీ శంకరాయ నమః'' మంత్రాన్ని జపించండి.
3. భార్యాభర్తల మధ్య సమస్యలుంటే ఈరోజు పూజా సమయంలో ''దేహి సౌభభం ఆరోగ్య దేహి మే పరమం సుఖం, పుత్ర పౌత్రాది సముద్భావ దేహి మే పరమేశ్వరి'' అనే మంత్రాన్ని జపించండి. దీంతో మీ కోరికలన్నీ నెరవేరుతాయి.
4. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగుండాలంటే.. మీరు పూజ సమయంలో మహామృత్యుంజ్య మంత్రాన్ని జపించండి. శివుడు మంచి ఆరోగ్యాన్ని, జీవితాన్ని ప్రసాదిస్తాడు.
5. మీరు ఈ రోజు పూజ అయిపోయిన తర్వాత అత్తగారి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోండి. ఆమెకు ఎరుపు రంగు చీర, మేకప్ మెటీరియల్ మరియు హర్తాళికా తీజ్ పూజ నైవేద్యాలను సమర్పించండి. ఇలా చేయడం వల్ల శుభం కలుగుతుంది.
Also Read: Grah Gochar 2022: సెప్టెంబరులో ఈ 3 గ్రహాల సంచారం... ఈ రాశులకు భారీ లాభం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook