Guru Margi November 2022: మీనరాశిలో బృహస్పతి తిరోగమనం.. నవంబర్ 24 నుండి ఈ రాశులను వరించనున్న అదృష్టం

Guru Margi November 2022: దేవతల గురువైన బృహస్పతి నవంబర్ 24న ప్రత్యక్ష సంచారంలోకి రానున్నాడు. గురుడి యెుక్క ఈ కదలిక వల్ల 5 రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 21, 2022, 03:01 PM IST
  • నవంబర్ 24న ప్రత్యక్ష సంచారంలోకి గురుడు
  • గురు మార్గి వల్ల ఈ రాశులకు ధనలాభం
  • ఇందులో మీరున్నారేమో చూసుకోండి
Guru Margi November 2022: మీనరాశిలో బృహస్పతి తిరోగమనం.. నవంబర్ 24 నుండి ఈ రాశులను వరించనున్న అదృష్టం

Guru Margi November 2022: హిందువులు బృహస్పతిని దేవతల గురువుగా భావిస్తారు. ఆస్ట్రాలజీలో గురు గ్రహాన్ని శుభప్రదంగా భావిస్తారు. మీనరాశిలో బృహస్పతి తిరోగమనంలో ఉన్నాడు. నవంబరు 24న గురు గ్రహం మీనరాశిలో మార్గంలోకి (Guru Margi in November 2022) రానున్నాడు. మీనరాశిలో బృహస్పతి యెుక్క ప్రత్యక్ష సంచారం కొందరికి శుభంగా, మరికొందరికి అశుభంగా ఉంటుంది. గురుమార్గి వల్ల ఏరాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం. 

కుంభ రాశి (Aquarius): బృహస్పతి సంచారం వల్ల ఈరాశివారు ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగం మారాలనుకునేవారికి ఇదే మంచి సమయం. వీరు కొత్త జాబ్ పొందే అవకాశం ఉంది. బిజినెస్ లో కొత్త డీల్స్ కుదుర్చుకోవడం వల్ల లాభాలు పెరుగుతాయి. కుటుంబంలో విభేదాలు తొలగి పరస్పర ప్రేమ పెరుగుతుంది. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 
మేషరాశి (Aries): గురు మార్గం వల్ల ఈ రాశి వారికి ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. బిజినెస్ విస్తరిస్తుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యత లేదా పదోన్నతి లభిస్తుంది. 
కన్య (Virgo): బృహస్పతి మార్గం వల్ల ఈరాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీరు భాగస్వామ్యంతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఏదైనా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. 

మీనరాశి (Pisces): ఈ రాశి వారు కుటుంబం నుండి అనేక శుభవార్తలను వింటారు. సంతానం పొందే అవకాశం ఉంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం కుదుట పడటంతోపాటు దీర్ఘకాలిక వ్యాధులు దూరమవుతాయి. విద్యారంగంలో పనిచేసే వ్యక్తులు ముందుకు సాగే అవకాశం ఉంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
వృశ్చిక రాశి (Scorpio): ఈ రాశివారు ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధిస్తారు. వ్యాపారంలో ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. కొత్త జాబ్ ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. మీరు ఉద్యోగంలో కొత్త బాధ్యతను తీసుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 

Also Read: Today Rasi Phalalu: నవంబర్ 19 రాశిఫలాలు.. ఇవాళ ఈరాశివారిని అదృష్టం వరిస్తుంది.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News