Garuda Purana For Life: గరుడ పురాణంలో విష్ణువు మహిమ వర్ణించబడింది. జీవన్మరణ రహస్యాలు గరుడ పురాణంలో (Garuda Purana) చాలా వివరంగా చెప్పబడ్డాయి. ఇందులో విజయవంతమైన మరియు సంతోషకరమైన జీవితానికి సంబంధించిన అనేక మార్గాలు ఉన్నాయి. కొన్ని చెడు అలవాట్లు గురించి గరుడ పురాణంలో చెప్పబడ్డాయి. ఇవి మానుకోకపోతే లక్ష్మీదేవి మీపై కోపంతో వెళ్లిపోతుంది. గరుడ పురాణం చెప్పిన ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఇతరుల సంతోషాన్ని చూసి అసూయపడకండి
ఇతరుల సంతోషాన్ని చూసి అసూయపడేవాళ్ళు కొందరు ఉంటారు. గరుడ పురాణం ప్రకారం, ఏ వ్యక్తి ఇతరుల సంతోషాన్ని చూసి అసూయపడకూడదు. దీని వల్ల మీరు తీవ్ర ఇబ్బందులు పడతారు.
2. శుభ్రత పట్ల శ్రద్ధ వహించండి
గరుడ పురాణం ప్రకారం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించే ప్రదేశంలో లక్ష్మీదేవి నివసిస్తుంది. అలాగే అశుభ్రంగా, మురికి బట్టలు వేసుకునే వారితో లక్ష్మి దేవి ఉండదు. అలాంటి వారు తమ జీవితమంతా పేదరికంలో గడుపుతారు. అందువల్ల, ఎల్లప్పుడూ పరిశుభ్రత ఉండాలి.
3. డబ్బు అనే అహంకారానికి దూరంగా ఉండండి
గురుడ పురాణం ప్రకారం, సంపద విషయంలో ఎప్పుడూ గర్వపడకూడదు. నిజానికి తన దగ్గర ఎక్కువ డబ్బు ఉందనే అహంకారంతో ఇతరులను అవమానించకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మిదేవి ఇంటి నుండి దూరంగా వెళ్లిపోతుంది.
4. రాత్రిపూట పెరుగు తినడం మానుకోండి
గరుడ పురాణంలో ఆహారం మరియు పానీయాలు కూడా చెప్పబడ్డాయి. గరుడ పురాణం ప్రకారం పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదని, అయితే రాత్రిపూట దీనిని మానుకోవాలని చెప్పారు. రాత్రిపూట పెరుగు తినడం వల్ల శరీరంలో యాసిడ్ పరిమాణం పెరుగుతుంది. దీని వల్ల మంచి నిద్ర లేకపోవటం మరియు అశాంతి పెరగడం మొదలవుతుంది.
Also Read: Palmistry: అరచేతిలో ఈ రేఖ ఉంటే... మీరు రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.