Ganesh Pooja on Wednesday: హిందూమతంలో గణేశుడి పూజకు విశేష మహత్యముంది. ఏదైనా శుభకార్యం ప్రారంభించేముందు గణేశుడి పూజతోనే ప్రారంభిస్తారు. బుధవారం గణేశుడికి సమర్పితం. విధి విధానాలతో పూజిస్తే..అన్ని కష్టాలు తొలగిపోతాయి.
వారంలో ప్రతిరోజూ ఏదో ఒక దేవతకు అంకితం. బుధవారం నాడు తొలిపూజ గణేశుడిదే. ఈ రోజున పూర్తి విధి విదానాలతో గణేశుడిని పూజిస్తే అన్ని కోర్కెలు నెరవేరుతాయి. ఇలా చేస్తే గణపతి ప్రసన్నుడై..భక్తుల సమస్యలు తీరుస్తాడని ప్రతీతి. కుండలిలో బుధుడు బలహీనంగా ఉంటే..బుధవారం నాడు విశేషంగా పూజలు చేయాలని చెబుతున్నారు. దీనివల్ల బుధదోషం తొలగుతుంది. బుధవారం నాడు ఏ విధంగా..గణేశుడికి పూజలు చేస్తే..శారీరక, ఆర్ధిక, మానసిక ఇబ్బందులుంటే దూరమౌతాయి. ఈ క్రమంలో గణేశుడి పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం..
బుధవారం నాడు ఉదయమే లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకుని గణేశుడిని పూజించాలి. ఇలా చేయడం వల్ల గణేశుడు..భక్తుల అన్ని కోర్కెలు పూర్తి చేస్తాడని విశ్వాసం. ఎవరి కుండలిలో అయితే..బుధుడు బలహీనంగా ఉంటాడో..ఆ వ్యక్తి ఆకుపచ్చ బట్టలు ధరించాలి. దాంతోపాటు ఆకుపచ్చ రుమాలు భుజంపై ధరించాలి. పేదలకు పెసరపప్పు, పచ్చని వస్త్రాలు దానం చేయాలి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గణేశుడికి లడ్డూ లేదా మోదక్ చాలా ప్రియం. బుధవారం నాడు గణేశుడికి మోదక్ ప్రసాదంగా ఇవ్వాలి. దీనివల్ల వ్యక్తి జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలు దూరమౌతాయి. బుధవారం నాడు ఆవులకు మేత తిన్పించడం వల్ల పుణ్యం వస్తుందంటారు. గణేశుడి నుదుట సింధూర తిలకం పెట్టడం వల్ల తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి. ఆర్ధికంగా సమస్యలుండవు. గణేశుడికి షమీ చెట్టు ఆకుల్ని సమర్పించడం వల్ల ఆ వ్యక్తి జీవితంలో ఒత్తిడి, మానసిక సమస్యలు దూరమౌతాయి. బుద్ధి వికసితమౌతుంది. గణేశుడిని ఓం గం గణాపతయే నమహ మంత్రంతో జపించాలి.
గణేశుడిని ఎలా పూజించాలి
బుధవారం నాడు ఉదయాన్నే లేచి స్నానం ముగించుకుని పూజ ప్రారంభించాలి. ముందుగా గణేశుడిని మనస్సులో ధ్యానం చేసుకుని గణేశ్ పూజ మొదలెట్టాలి. ఒకవేళ బుధవారం వ్రతం పాటించాలనుకుంటే..వ్రత సంకల్పం ముఖ్యం. తూర్పు లేదా ఉత్తర దిశకు అభిముఖంగా కూర్చోవాలి. ఆ తరువాత గణేశుడికి పుష్పం, ధూపం, దీపం, కర్పూరం, రోలీ, చందనం, మోదక్ అర్పించాలి. గణేశుడికి సింధూరం తిలకంగా పెట్టాలి. చివరిగా గణేశుడికి హారతిచ్చి..గణేశ మంత్రం పఠించాలి. ఇలా భక్తిశ్రద్ధలతో చేస్తే గణేశుడు ప్రసన్నమౌతాడు.
Also read: Skanda Shashthi 2022: స్కంద షష్ఠి ఎప్పుడు? దీనిని ఎందుకు జరుపుకుంటారు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook