Ganesh Visarjan: వినాయకుడి నిమజ్జనం ఎందుకు చేయాలి.. దీని వెనుక ఉన్న ఈ రహాస్యం ఏంటో మీకు తెలుసా..?

Ganesh Immersion: గణేష్ నవరాత్రి ఉత్సవాలు దేశమంతాట ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భక్తులంతా తమ గణపయ్యను ఊరేగింపుగా తీసుకెళ్లి విసర్జన కార్యక్రమం  నిర్వహిస్తున్నారు. దీని వెనుక గొప్ప విషయందాగి ఉందని కూడా చెబుతుంటారు.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.  

Written by - Inamdar Paresh | Last Updated : Sep 15, 2024, 06:08 PM IST
  • దేశమంతట ఘనంగా గణేష్ ఉత్సవాలు..
  • నిమజ్జనంకు తీసుకెళ్తున్న భక్తులు..
Ganesh Visarjan: వినాయకుడి నిమజ్జనం ఎందుకు చేయాలి.. దీని వెనుక ఉన్న ఈ రహాస్యం ఏంటో మీకు తెలుసా..?

Ganesh immersion traditional Reason: దేశ మంతాట కూడా వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. చాలా మంది భాద్రపదమాసం చతుర్థి రోజున వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తారు. ఊరు, వాడ, పల్లే, పట్నం తేడా లేకుండా గణపయ్య విగ్రహాలను భక్తితో ప్రతిష్టాపన చేస్తుంటాకు. కొంత మంది ఒకరోజు, 3,5, 9, 11 ఇలా.. వారి వారి ఇంట్లో పద్దతుల్ని బట్టి గణేష్ ఉత్సవాలను జరుపుకుంటారు.

ఇదిలా ఉండగా.. వినాయక నవరాత్రి తొమ్మిది రోజులు కూడా అనేక వెరైటీలో ప్రసాదం నైవేద్యంగా పెడుతుంటారు. తమకు ఉన్న శక్తికోలది స్వామివారిని భక్తితో పూజించుకుంటారు. కొంత మంది గణపయ్య వేడుకల్లో భాగంగా అన్నదానాలు, కుంకుమార్చన పూజలు సైతం చేస్తుంటారు. గణేష్ విగ్రహాం ప్రతిష్టాపన రోజున 21 రకాల ఆకులతో స్వామి వారిని పూజించుకుంటారు. ముఖ్యంగా.. వీటిల్లో.. 

1. మాచీపత్రం                            
 2. బృహతీపత్రం (వాకుడు)
3. బిల్వపత్రం (మారేడు) 
4. దూర్వాయుగ్మం (గరికె)
5. దుత్తూరపత్రం (ఉమ్మెత్త)           
6. బదరీపత్రం (రేగు)
7. అపామార్గపత్రం (ఉత్తరేణి)           
8. వటపత్రం (మఱ్ఱి)
9. చూతపత్రం (మామిడి)           
10. కరవీరపత్రం (గన్నేరు)
11. విష్ణుక్రాంతపత్రం                      
12. దాడిమీపత్రం (దానిమ్మ)
13. దేవదారుపత్రం                        
14. మరువకపత్రం (మరువం)
15. సింధువారపత్రం (వావిలి)           
16. జాజీపత్రం (సన్నజాజి)
17. గండకీపత్రం    
18. శమీపత్రం (జమ్మి)
19. అశ్వత్థపత్రం (రావి)  
20. అర్జునపత్రం (మద్ది)
21. అర్కపత్రం (తెల్ల జిల్లేడు)

ఈ పత్రాలన్ని ఔషధగుణాల్ని కూడా కల్గి ఉంటాయి.ఈ పత్రాలలో కొన్ని పాలు స్రవిస్తాయి మరికొన్ని పసరును స్రవించేవి. ఇవి.. శరీరంలోకి వెళ్లి రక్తాన్ని శుద్ధిచేసి, నరాలకు ఎనర్జీనీ సైతం కలిగిస్తాయి. ఆ పత్రాలను సేకరించేందుకు వెళ్లినప్పుడు.. మొక్కల దగ్గర గడుపుతూ, అవి విడుదల చేసే ప్రాణవాయువును పీలుస్తాం.  అయితే.. ఈ 21 రకాల ఆకుల్లో ఎన్నో రకాలు ఔషధ గుణాలు ఉండటం వల్ల.. ఇది ఎండిపోయిన తర్వాత వీటిని వినాయకులతో పాటు.. నీళ్లలో విసర్జనం చేస్తారు. కొంత మంది బావుల్లో వేస్తే, మరికొందరు చెరువుల్లో వేస్తారు.

Read more: Pitru Dosh: ఈ సంకేతాలు మీ ఇంట్లో ఈ కన్పిస్తున్నాయా..?. అయితే పితృదోషం ఉన్నట్లే.. పండితులు ఏమంటున్నారంటే..?

ఇంకొందరు నదుల్లో కూడా వేస్తుంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో నదులలో కొత్త నీరు వచ్చి చేరుతుంది. ఇవి కొన్ని చోట్ల వరదలుగా మారి.. అది పుట్టలు, ఇతర విషపూరిమైన జీవులు కూడా ఆ నీళ్లలో ఉంటాయి. అందువల్ల.. గణపయ్యను, 21 రకాల ఆకులతో పాటు నిమజ్జనంచేసినప్పుడు..ఈ ఔషధాల్లోని గుణాలు.. ఆ వరద నీటిలోని విషపూరితమైన స్వభావాన్ని దూరం చేసి, నీటిని శుద్ది చేస్తాయి. అందుకే.. ఈ విధంగా ఎకో ఫ్రెండ్లీ  గణేషుడిని, పత్రాలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల.. నీటిలోని చెడు, విషపూరిత స్వభావంను ఇవి శుధ్ది చేస్తాయి. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News