Gajakesari Yoga In Telugu: చాంద్రమానం ప్రకారం శ్రావణ మాసం ఆగస్టు 5వ తేది నుంచి ప్రారంభం కాబోతోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికే ప్రారంభమైంది. హిందూ పురాణాల ప్రకారం, శ్రావణ మాసానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఈ మాసాన్ని పరమ శివుడికి అకింతం చేస్తారు. ఈ సమయంలో హిందువులు శివపార్వతులను పూజించి ప్రత్యేకమైన ఉపవాసాలు పాటిస్తారు. ఇంతి ప్రాముఖ్యత కలిగిన మాసంలో రెండవ సోమవారం ఎన్నో సంవత్సరాల తర్వాత గజకేశరి యోగం ఏర్పడతోంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు వీరికి శివుడి అనుగ్రహం లభించి అదృష్టం కూడా పెరుగుతుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వృషభ రాశి:
శ్రావణ మాసంలో ఎంతో శక్తివంతమైన గజకేశరి యోగం ఏర్పడడం వల్ల ఈ రాశివారికి అనుకున్న పనులు సులభంగా జరుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. అలాగే డబ్బు సంబంధిత సమస్యల నుంచి సులభంగా విముక్తి లభించి అనుకున్న పెట్టుబడులు పెట్టే ఛాన్స్ కూడా ఉంది. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం చాలా అనుకులంగా ఉండబోతోంది. అలాగే కుటుంబ సభ్యుల సపోర్ట్ లభించి వ్యక్తిగత జీవితంలో శాంతి, సంతోషాలు కూడా రెట్టింపు అవుతాయి. అంతేకాకుండా వీరు ఈ సమయంలో అద్భుతమైన జీవితాన్ని గడుపుతారు.
మకర రాశి:
మకర రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడమే కాకుండా అనుకున్న పనులు కూడా జరుగుతాయి. దీంతో పాటు భారీగా లాభాలు కూడా పొందుతారు. వ్యాపారాలు చేసేవారు ఎలాంటి పెట్టుబడులు పెట్టిన డబ్బులు సంపాదిస్తారు. అంతేకాకుండా చిరకాల కోరికలు కూడా నెరవేరుతాయి. దీంతో పాటు అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కూడా లభిస్తుంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
సింహ రాశి:
శ్రావణ మాసంలో ఏర్పడే గజకేశరి యోగం కారణంగా సింహ రాశివారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. దీంతో పాటు సంపాదన కూడా పెరుగుతుంది. అలాగే దాంపత్య జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయి. అలాగే ఆర్థికంగా కూడా ఈ సమయం ఎంతో బాగుటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి