Gajkesari Yoga Effects: 2024 కొత్త సంవత్సరంలో జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రత్యేక యోగాలు ఏర్పడబోతున్నాయి. ఈ సంవత్సరంలో అశుభ యోగాల కంటే శుభ యోగాలు ఎక్కువగా ఏర్పడబోతున్నాయి. జనవరి నెలలో ఈ సంవత్సరం మొదటి యోగం గజకేసరి యోగం ఏర్పడబోతోంది. ఈ రాజయోగం జనవరి 18న ఏర్పడబోతోంది. చంద్ర, బృహస్పతి గ్రహాల కలయిక కారణంగా ఈ ప్రత్యేక యోగం ఏర్పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
జనవరి 18న చంద్ర గ్రహం మేషరాశిలోకి సంచారం చేయబోతోంది. అయితే ఇప్పటికే బృహస్పతి గ్రహం అదే రాశిలో ఉంది. కాబట్టి ఈ రెండు గ్రహాలు కలవబోతున్నాయి. అయితే ఈ కలయిక ప్రక్రియ జనవరి 20 ఉదయం 8:53 వరకు కొనసాగుతుంది.
చంద్ర, బృహస్పతి గ్రహాల సంయోగం కారణంగా ఏర్పడిన గజకేసరి రాజయోగానికి జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే ఇదే సమయంలో సర్బర్థ సిద్ధి యోగం కూడా ఏర్పడబోతోంది. దీని కారణంగా ఈ రెండు రాజయోగాల ప్రభావం కొన్ని రాశులవారిపై ప్రత్యేక్షంగా పడబోతోంది.
ఈ రెండు యోగాల వల్ల ఏర్పడే ప్రభావం కారణంగా కొన్ని రాశులవారి జీవితాల్లో జనవరి 18 తేది నుంచి అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు, మానసిక ప్రశాంతత కూడా కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
మేషం రాశి:
గజకేశరి యోగం కారణంగా మేష రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మనశ్శాంతిని పొందుతారు. అంతేకాకుండా ప్రతి పనిలో విజయాలు తప్పకుండా సాధిస్తారు. దీంతో పాటు అకస్మిక ఆర్థిక ప్రయోజనాలు పొందే ఛాన్స్ కూడా ఉంది. పెడింగ్‌లో ఉన్న పనులన్నీ సులభంగా పూర్తవుతాయి.
మిథున రాశి:
గజకేశరి యోగం మిథున రాశి చాలా లాభదాయకంగా ఉంటుందని శాస్త్ర నిపుణులు తెలిపారు. ఈ రాశివారికి ఆర్థిక అంశాలలో, సామాజిక జీవితంలో ఊహించని బలాన్ని పొందుతారు. అంతేకాకుండా కీర్తి కూడా సులభంగా పెరుగుతుంది. ఈ సమయంలో వీరికి కొన్ని కొత్త ఆదాయ వనరుల లభించి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.
సింహ రాశి:
సింహ రాశివారు ఈ రెండు యోగాల కారణంగా ఊహించని సంపద పొందుతారు. అంతేకాకుండా వ్యక్తిగత జీవితంలో మానసిక ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపారాల్లో కూడా మంచి లాభలు పొందుతారు. న్యాయపరమైన వివాదాలు పరిష్కారమవుతాయి.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter