Feng shui vastu: ఈ ఫెంగ్‌షుయ్‌ వస్తువు మీ ఇంట్లో ఉంటే నెగిటీవ్ ఎనర్జీకి చోటే ఉండదు..

Feng shui vastu Tips: వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టినట్టే ఇంట్లో ఉన్న వస్తువులు కూడా వాస్తు ప్రకారం మాత్రమే ఉండాలి. అయితే ఫేంగ్‌ షుయ్‌ వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు మన ఇంట్లో తప్పకుండా ఉండాలి.

Written by - Renuka Godugu | Last Updated : May 26, 2024, 03:32 PM IST
Feng shui vastu: ఈ ఫెంగ్‌షుయ్‌ వస్తువు మీ ఇంట్లో ఉంటే నెగిటీవ్ ఎనర్జీకి చోటే ఉండదు..

Feng shui vastu Tips: వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టినట్టే ఇంట్లో ఉన్న వస్తువులు కూడా వాస్తు ప్రకారం మాత్రమే ఉండాలి. అయితే ఫేంగ్‌ షుయ్‌ వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు మన ఇంట్లో తప్పకుండా ఉండాలి. వీటివల్ల ఇంట్లో నెగెటివిటీ తొలగిపోతుంది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు ఫెంగ్‌ షుయ్‌ వాస్తు ప్రకారం మన ఇంట్లో ఏ వస్తువులు ఉండాలో తెలుసుకుందాం.

లక్కీ బ్యాంబో ప్లాంట్..
ఈ లక్కీ బ్యాంబో ప్లాంట్ చాలామంది ఇళ్లలో పెట్టుకుంటున్నారు. మామూలుగా ఆఫీసులో కూడా ఇవి ఉంటాయి. ఈ లక్కీ ప్లాంట్ వాస్తు ప్రకారం మన ఇంట్లో ఉండటం వల్ల ఇంటికి శుభప్రదం ఇంట్లో ఆరోగ్య సమస్యలు రావు. లక్కీ బ్యాంబో ప్లాంట్ ను తూర్పు లేదా ఈశాన్య దిశలో ఏర్పాటు చేసుకోవాలి.

విండ్ చైమ్..
విండ్ చైమ్ మన ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వల్ల వీటి నుంచి వచ్చే శబ్దాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇవి మన ఇంటి వాతావరణంలో నెగటివ్ ఎనర్జీకి చోటు ఉండకుండా చేస్తాయి. వాస్తు ప్రకారం విండ్ చైమ్స్ విజయానికి, శుభానికి ప్రతీకగా నిలుస్తుంది.

తాబేలు..
తాబేలు స్థిరత్వానికి ప్రతీకగా చెప్తారు. ఇంట్లో తాబేలును ఉత్తర దిశలో ఏర్పాటు చేసుకోవడం వల్ల మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు.

ఇదీ చదవండి: పడుకునేటప్పుడు దిండు చుట్టూ ఖాళీగా ఎందుకు ఉంచాలి? తప్పక తెలుసుకోండి..

లాఫింగ్ బుద్ధ..
లాఫింగ్ బుద్ధ మనం ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. లాఫింగ్ బుద్ధా మన ఇంటి లివింగ్ రూమ్ లో ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ మనం ఎక్కువ సమయం పాటు గడుపుతాం కాబట్టి లాఫింగ్ బుద్ధ ను ఇంటి హాల్లో ఏర్పాటు చేసుకుంటారు. దీంతో మీ ఇంట్లో సుకః శాంతులు వెల్లివిరుస్తాయి.

డ్రాగన్ టార్టుల్..
వాస్తు ప్రకారం డ్రాగన్ టార్టిల్‌ను ఉత్తరదిశలో ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆ ఇంట్లో ఉన్నవారు త్వరగా ధనవంతులు అవుతారు. ఉత్తర దిశలో ఏర్పాటు చేసుకున్న ఈ డ్రాగన్ టార్టెల్ ఇంటికి ధనాకర్షణను తీసుకువస్తుంది. ఆ ఇంట్లో ఉన్న వారికి అదృష్టం వరిస్తుంది.

ఇదీ చదవండి:  బుద్ధపూర్ణిమ ఎప్పుడు? ఆరోజు ఈ ఒక్క వస్తువు ఇంటికి తీసుకువస్తే మీకు ధనవర్షం ఖాయం..

పిరమిడ్..
ఫెంగ్‌ షుయ్‌ వాస్తు ప్రకారం ఇంట్లో పిరమిడ్ పెట్టుకోవాలి. ఇది ఇంటి మధ్య భాగంలో ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో సుఖశాంతులు వెళ్లి విరుస్తాయి.. ఫెంగ్‌ షుయ్‌ పిరమిడ్‌ కుటుంబంలో సఖ్యత నెలకొంటుంది ఆ ఇంటికి శక్తి పెరుగుతుంది ఆధారంగా పిరమిడ్ అంటేనే బలానికి స్థిరత్వానికి ప్రతీక.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News