Mahavir Jayanti 2023 Significance: ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో శుక్ల పక్షంలోని త్రయోదశి రోజున మహావీర్ జయంతిని జరుపుకుంటారు జైన మతస్తులు. ఈ సంవత్సరం మహావీర్ జయంతి ఏప్రిల్ 04న అంటే రేపు జరుపుకోబోతున్నారు. జైనమతానికి చెందిన 24వ తీర్థంకరుడైన మహావీర్ స్వామి బీహార్లోని కుందగ్రామ్లో జన్మించారు.
మహావీరుని చిన్ననాటి పేరు వర్ధమాన్ కాగా 30 ఏళ్ల వయసులో రాజ భోగ భాగ్యాలను త్యజించి సత్యాన్వేషణలో అడవుల బాట పట్టాడని చెబుతారు. అలా దట్టమైన అరణ్యాలలో నివసిస్తూ పన్నెండేళ్లపాటు కఠోర తపస్సు చేసి, ఆ తర్వాత రిజుబాలుకా నది ఒడ్డున ఉన్న సాల చెట్టు క్రింద కైవల్య జ్ఞానాన్ని పొందాడని చెబుతూ ఉంటారు. మహావీరుడు సమాజ శ్రేయస్సు కోసం, ప్రజల సంక్షేమం కోసం అనేక ప్రభోదనలు చేశారు. అలాంటి మహావీర్ జయంతి శుభ సమయం ఎప్పుడో తెలుసుకుందాం.
మహావీర్ జయంతి 2023 శుభ ముహూర్తం
పంచాంగం ప్రకారం, చైత్ర మాసంలో శుక్ల పక్ష త్రయోదశి తిథి 03 ఏప్రిల్ 2023 ఉదయం 06.24 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీ మరుసటి రోజు 04 ఏప్రిల్ 2023 ఉదయం 08.05 గంటలకు ముగుస్తుంది. ఏప్రిల్ 04న ఉదయ తిథిని స్వీకరిస్తున్నారు, కాబట్టి మహావీర్ జయంతి ఏప్రిల్ 04న మాత్రమే జరుపుకుంటారని చెబుతున్నారు. జైన మతానికి చెందిన వారికీ ఈ మహావీర్ జయంతి చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. మహావీర్ జయంతి రోజున, జైన మత ప్రజలు ప్రభాత్ ఫేరీ, ఆచారాలు, ఊరేగింపులను నిర్వహిస్తారు.
ఇక ఈ మహావీరుడు మానవులు మోక్షాన్ని పొందేందుకు ఐదు నియమాలను ఏర్పాటు చేసాడు, దీనిని పంచ సిద్ధాంతం అని అంటారు. ఈ ఐదు సూత్రాలు అహింస, అస్తేయ, బ్రహ్మచర్య, సత్యం, అపరిగ్రహం. ఇక జైనులు మహావీర్ జయంతి రోజున భగవాన్ మహావీరుడిని పూజిస్తారు, ఆయన బోధనలను స్మరించుకుంటూ ఆయన ఇచ్చిన సూత్రాలను అనుసరించడానికి కృషి చేస్తారు. అలాగే ఈ సందర్భంగా ధార్మిక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తారు.
Also Read: Hanuman Jayanti 2023: హనుమాన్ జయంతి రోజు ఇలా చేస్తే మీకు శని బాధ తప్పినట్టే?
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook