Gajakesari Yoga In Taurus 2024: గ్రహాలు రాశి సంచారం చేయడం వల్ల అన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. ఈ రాశి సంచారం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటే, మరికొన్ని రాశులవారికి అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు రాశి సంచారం చేయడం వల్ల సంవత్సరం మొత్తం కొన్ని రాశులవారిపై ప్రభావం పడుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా జూన్ 4న చంద్రుడు రాశి సంచారం చేశాడు.
వృషభరాశిలో గజకేశరి యోగం..
జూన్ 4వ తేదీ చంద్రుడు వృషభరాశిలోకి సంచారం చేసింది. ఇదిలా ఉండగా జూన్ 7న బృహస్పతి కూడా వృషభ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీంతో ఈ చంద్ర, బృహస్పతి గ్రహాల కలయిక ఏర్పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో ఎంతో శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడబోతోంది. ఈ రాజయోగం కారణంగా మూడు రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వారికి శుభప్రదమైన సమయం కూడా మొదలవుతుంది.
మేష రాశి:
గజకేశరి యోగం ఏర్పడడం వల్ల మేష రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారికి ఒత్తిడి నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఆనందం, శాంతి కూడా పెరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే నిలిపోయిన డబ్బులు కూడా సులభంగా తిరిగి వస్తాయి. ఈ దీంతో పాటు ఖర్చులు కూడా సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా మతపరమైన విషయాలపై కూడా అసక్తి పెరుగుతుంది. అలాగే కొత్త ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి.
కన్యా రాశి:
ఈ ప్రత్యేకమైన యోగం ఏర్పడడం వల్ల కన్యా రాశివారికి స్వర్ణ కాలం ప్రారంభమవుతుంది. నిలిచిపోయిన పనులు కూడా సులభంగా పూర్తయ్యే ఛాన్స్ కూడా ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ఆస్తి పరమైన విషయాల్లో కూడా కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అలాగే ప్రేమ జీవితంలో సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. అలాగే భాగస్వామ్య జీవితంలో వస్తున్న సమస్యల కూడా తొలగిపోతాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
తుల రాశి:
తుల రాశివారికి కూడా ఈ సమయంలో ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు పెద్ద పెద్ద సమస్యల నుంచి కూడా సులభంగా పరిష్కారం లభించే చాన్స్ ఉంది. అలాగే కెరీర్ కూడా మెరుగుపడే ఛాన్స్ కూడా ఉంది. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి పదోన్నతులు కూడా లభిస్తాయి. అంతేకాకుండా జీతాలు కూడా పెరుగుతాయి. అలాగే వ్యాపాల్లో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. దీంతో పాటు వైవాహిక జీవితంలో సమస్యలు కూడా దూరమవుతాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి