Chandra Grahan 2024: 2024లో ఈ రాశుల వారిపై తొలి చంద్రగ్రహణం ఎఫెక్ట్.. జరగబోయేది తెలిస్తే ఆశ్చర్య పోవడం ఖాయం..

Chandra Grahan Horoscope 2024: మార్చి 25వ తేదీన ఏర్పడబోయే తొలి చంద్రగ్రహణం కారణంగా కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వైవాహిక జీవితంలో మార్పులు వచ్చి.. జీవిత భాగస్వామితో సంతోషపరమైన రోజులు గడుపుతారు. ఆర్థికంగా కూడా ఊహించని లాభాలు పొందుతారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2024, 10:41 AM IST
Chandra Grahan 2024: 2024లో ఈ రాశుల వారిపై తొలి చంద్రగ్రహణం ఎఫెక్ట్.. జరగబోయేది తెలిస్తే ఆశ్చర్య పోవడం ఖాయం..

Chandra Grahan Horoscope 2024: ప్రతి సంవత్సరం నాలుగు గ్రహణాలు ఏర్పడతాయి. అయితే 2024 సంవత్సరంలో కూడా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 4 గ్రహణాలు ఏర్పడబోతున్నాయి. ఇందులో రెండు సూర్యగ్రహణాలైతే మరో రెండు చంద్రగ్రహణాలు.. మతపరంగా ఈ రెండు గ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రహణాలు ఏర్పడడం వల్ల అన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. అయితే ఈ సంవత్సరం మొట్టమొదటి చంద్రగ్రహణం మార్చి 25వ తేదీన ఏర్పడబోతోంది. ఇది ఉదయం 10:24 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ చంద్రగ్రహణం తెల్లవారుజామున 3:01 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ గ్రహణం కారణంగా కొన్ని రాశుల వారికి అనేక ఆర్థిక లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో ఊహించని విజయాలు కూడా సాధిస్తారు. ఈ సంవత్సరంలో ఏర్పడే మొట్టమొదటి చంద్రగ్రహణం ఏ రాశుల వారిపై ప్రభావితం చూపుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశుల వారిపై చంద్రగ్రహణం ఎఫెక్ట్..
మిధున రాశి:

ఏర్పడబోయే చంద్రగ్రహణం కారణంగా మిథున రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేసే వారికి అధికారుల పూర్తి మద్దతు లభించి మంచి పేరు పొందుతారు. ఈ సమయంలో ఆర్థికంగా లాభపడే అవకాశాలు కూడా ఉన్నాయి. తల్లిదండ్రుల సపోర్టు లభించి వ్యాపారాల్లో కూడా తిరుగులేని విజయాలు సాధిస్తారు. ఇక ప్రేమ జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది న్యాయపరమైన చిక్కులు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల భారీ లాభాలు పొందుతారు. ఒంటరి జీవితం గడుపుతున్న వారికి వివాహాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..

తులారాశి:
మొదటి చంద్రగ్రహణం ఏర్పడడం కారణంగా తులా రాశి వారు ఎలాంటి పనుల్లోనైనా సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఇక సమాజ సేవ చేస్తున్న వారికి ఈ సమయంలో మంచి పేరు లభిస్తుంది. అంతేకాకుండా తులా రాశి వారికి ఈ సమయంలో భార్య సపోర్ట్‌ లభించి, వ్యాపారాల్లో ఎన్నడూ పొందలేని లాభాలు పొందుతారు. అంతేకాకుండా గోల్డ్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్న వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అయితే ఈ సమయంలో అందరితో మాట్లాడే క్రమంలో తప్పకుండా పలు రకాలు జాగ్రత్తలు పాటించారు.

మకర రాశి:
తొలి చంద్రగ్రహణ ప్రభావం మకర రాశి వారిపై కూడా పడబోతోంది. దీని కారణంగా వైవాహిక జీవితంలో మధురమైన రోజులు వస్తాయి. ఇక ప్రేమ జీవితం గడుపుతున్న వారికి శృంగారంపై మరింత ఆసక్తి పెరుగుతుంది. అంతేకాకుండా చిన్న చిన్న ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ సమయం చాలా కలిసి వస్తుంది. పూర్వీకుల నుంచి పొందాల్సిన ఆస్తిని కూడా పొందుతారు. ఇంతక ముందు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయంలో ఉపశమనం లభిస్తుంది.

Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News