Navratrulu 2022: నవరాత్రులలో ఇలా చేస్తే... మీకు లక్ష్మీదేవి ఊహించనంత ధనాన్ని ఇస్తుంది...

Navratrulu 2022: ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి ఎన్నో రకాల పూజలు, పరిహారాలు చేస్తారు. అయితే నవరాత్రుల్లో ఈ చర్యలు తీసుకుంటే ఆ తల్లి కృప మీపై ఎల్లప్పుడూ ఉంటుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 17, 2022, 01:33 PM IST
Navratrulu 2022: నవరాత్రులలో ఇలా చేస్తే... మీకు లక్ష్మీదేవి ఊహించనంత ధనాన్ని ఇస్తుంది...

Shardiya Navratri 2022 Remedies: ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని కోరుకుంటారు. ఆ తల్లి కృప కోసం ఎన్నో పూజలు, ఎన్నో రకాల నోములు చేస్తుంటారు. లక్ష్మీదేవి (Goddess Lakshmi Devi) కటాక్షం ఉంటే దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు. మీరు త్వరలో కోటీశ్వరులు అవ్వాలనుకుంటే శారదీయ నవరాత్రులు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ దేవీ నవరాత్రుల్లో కొన్ని పరిహారాలు చేయడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది. ఆ 9 రోజుల్లో మనం తీసుకోవాల్సిన చర్యలేంటో తెలుసుకుందాం. 

>> నవరాత్రులలో కూర్చున్న లక్ష్మీదేవి బొమ్మతో ఉన్న బంగారు లేదా వెండి నాణేన్ని ఇంటికి తెచ్చి పూజించండి. ఇలా ప్రతి రోజూ చేయడం ద్వారా మీ సంపద పెరుగుతుంది. 
>> నవరాత్రుల్లో దుర్గాదేవితోపాటులక్ష్మీదేవిని పూజించండి. ఆరాధనలో తామరపువ్వు ఉండేలా చూసుకోండి. ఇలా చేయడం వల్ల మీ దురదృష్టం కాస్తా అదృష్టంగా మారుతుంది.   
>> నవరాత్రులలో మొదటి రోజున శంఖపుష్ప వేళ్లను ఇంటికి తెచ్చి శుభ ముహూర్తంలో పూజించండి. అనంతరం దానిని ఖజానా ఉన్న ప్లేస్ లో ఉంచాలి. ఈ పరిహారం చేయడం వల్ల ఖజానా ఎల్లప్పుడూ డబ్బుతో తులతూగుతుంది. 
>> నవరాత్రులలో ఇంట్లో అరటి మొక్కను నాటండి. ప్రతి గురువారం ఆ మెుక్కకు పాలు కలిపిన నీటిని పోయండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవితో పాటు విష్ణువు కూడా ప్రసన్నుడై అపారమైన సంపదను ఇస్తాడు. 
>> నవరాత్రులలో లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడాని, మర్రి చెట్టు ఆకులపై కుంకుమతో స్వస్తిక చిహ్నం చేయండి. అప్పుడు లక్ష్మీ దేవి పూజలో ఈ ఆకులను సమర్పించండి. దీంతో తల్లి సంతోషించి మీపై డబ్బు వర్షం కురిపిస్తుంది.  

Also Read: Vishwakarma Puja 2022: ఇవాళే విశ్వకర్మ జయంతి.. ఈ శుభముహూర్తంలో విశ్వకర్మను పూజించండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News