Surya Budh Guru Yuti 2023: ఒకే రాశిలో 3 గ్రహాల కలయిక.. ఈ మూడు రాశులకు తిరుగులేదు ఇక..

Surya Budh Guru Yuti 2023: నిన్న సూర్యుడు, బుధుడు మరియు బృహస్పతి వంటి శక్తివంతమైన గ్రహాలు మీనంలో కలిసి కదులుతున్నాయి. దీంతో 3 రాశుల వారు ఉద్యోగ-వ్యాపారంలో విపరీతమైన లాభాలను పొందుతారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 17, 2023, 10:25 AM IST
Surya Budh Guru Yuti 2023: ఒకే రాశిలో 3 గ్రహాల కలయిక.. ఈ మూడు రాశులకు తిరుగులేదు ఇక..

Surya Budh Guru Yuti 2023: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. ఒకటి కంటే ఎక్కువ శక్తివంతమైన గ్రహాలు ఒకే రాశిలో గుమిగూడితే వాటి ప్రభావం ప్రజలందరిపై ఖచ్చితంగా ఉంటుంది.  గ్రహాల రాజు సూర్యుడు, యువరాజు బుధుడు మరియు దేవగురు బృహస్పతి మార్చి 16న మీనరాశిలో కలిశారు. ఈ 3 శక్తివంతమైన గ్రహాల సంయోగం మూడు రాశులవారి అదృష్టాన్ని ప్రకాశింపజేస్తుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

సూర్య గురు శుక్ర యుతి ఈరాశులకు వరం
వృశ్చిక రాశి
సూర్యుడు, బుధుడు మరియు గురువు కలయిక మీకు గొప్ప ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగ-వ్యాపారాలలో పురోగతిని సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధిస్తారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. అనుకోకుండా డబ్బు వస్తుది. మీరు పెట్టుబడి నుండి ప్రయోజనం పొందుతారు. 
మిథునరాశి
మీ జాతకంలో బుధుడు శుభ ప్రదేశంలో ఉన్నాడు. వ్యాపారంలో విపరీతమైన లాభం ఉంటుంది. విజ్ఞాన శాస్త్రం, విద్య, న్యాయవాద లేదా వైద్య వృత్తితో సంబంధం ఉన్నవారికి ఈ సమయం బాగుంటుంది. మీ కెరీర్ మునుపటి కంటే బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. 
వృషభం
ఈ మూడు గ్రహాల కలయిక వల్ల మీరు మంచి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. వ్యాపారులు పెద్ద డీల్ ను కుదుర్చుకుంటారు. పూర్వీకుల ఆస్తి లభించే అవకాశం ఉంది. మీరు ఆఫీసులో కొత్త బాధ్యతను తీసుకుంటారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.  

Also Read: Budh Guru Yuti 2023: మీనరాశిలో బృహస్పతి-బుధ సంయోగం... ఈ రాశులపై డబ్బు వర్షం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News