Fengshui tips: ఫెంగ్ షుయ్ ఏనుగు ఇంటికి అంతులేని సంపదను తెస్తుంది, అయితే ఇవి గుర్తించుకోండి..

Fengshui Elephant Tips: చైనీస్ వాస్తుశాస్త్రం ఫెంగ్ షుయ్ ప్రకారం, ఇంట్లో ఉంచిన ప్రతీ వస్తువు వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. డబ్బుకు సంబంధించిన అనేక చిట్కాలు ఫెంగ్ షుయ్ లో చెప్పబడ్డాయి.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 9, 2022, 04:48 PM IST
Fengshui tips: ఫెంగ్ షుయ్ ఏనుగు ఇంటికి అంతులేని సంపదను తెస్తుంది, అయితే ఇవి గుర్తించుకోండి..

Fengshui Elephant Tips: మనకు ఒక వాస్తుశాస్త్రం ఉన్నట్లే చైనీస్ వారికి ఓ వాస్తు శాస్త్రం ఉంది. దానినే ఫెంగ్ షుయ్ అంటారు. ఫెంగ్‌షుయ్‌ ప్రకారం, ఏనుగు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది ఇంట్లో ఉంటే వారికి దేనికీ లోటు ఉండదు. ఇంట్లో ఫెంగ్ షుయ్ ఏనుగును (Fengshui Elephant) ఉంచడం వల్ల  మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. అయితే ఈ ఏనుగును ఇంట్లో లేదా ఆఫీసులో ఉంచేటప్పుడు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. 

ఫెంగ్ షుయ్ ఏనుగు శుభఫలితాలు
మీకు జీవితంలో ఆనందం, గౌరవం మరియు విజయం కావాలంటే, ఫెంగ్ షుయ్ ఏనుగు విగ్రహాన్ని ఇంటికి తీసుకురండి. దీనిని ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచడం శుభప్రదం. సంతానం లేని దంపతులు పడగగదిలో రెండు ఏనుగు విగ్రహాలను పెట్టుకోండి. తద్వారా మీకు త్వరలోనే పిల్లలు కలుగుతారు. ఇంట్లో ఫెంగ్ షుయ్ ఏనుగును ఉంచడం వల్ల ఇంట్లో పాజిటివిటీతోపాటు అపారమైన సంపద వస్తుంది.  

ఈ విషయాలు గుర్తించుకోండి..
ఫెంగ్ షుయ్ ఏనుగును కొనుగోలు చేయడానికి మరియు ఉంచడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి.  నలుపు రంగు ఫెంగ్ షుయ్ ఏనుగును ఎప్పుడూ కొనకండి ఎందుకంటే ఈ రంగు ఏనుగు శుభ ఫలితాలను ఇవ్వదు. తెల్ల ఏనుగును ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంటి వాతావరణం బాగుంటుంది. ఏనుగును ఎల్లప్పుడూ ఇంటికి ఉత్తర దిశలో ఉంచాలి. ఒక జత ఫెంగ్ షుయ్ ఏనుగులను ఇంట్లో ఉంచినట్లయితే, వాటి ముఖాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండేలా చూసుకోండి. వెనుక వైపు ఉంచడం ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది. 

Also Read: Surya Gochar 2022: సెప్టెంబర్ 17 నుండి ప్రకాశించనున్న ఈ రాశుల వారి అదృష్టం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News