Budh Gochar 2023: బుధుడి మకరరాశి ప్రవేశం... ఈ రాశులకు గోల్డెన్ డేస్ మెుదలవ్వడం ఖాయం...

Budh Gochar 2023: గ్రహాల యువరాజు బుధుడు మరో నాలుగు రోజుల్లో తన రాశిని మార్చనున్నాడు. దీంతో కొన్ని రాశులవారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2023, 04:46 PM IST
Budh Gochar 2023: బుధుడి మకరరాశి ప్రవేశం... ఈ రాశులకు గోల్డెన్ డేస్ మెుదలవ్వడం ఖాయం...

Budh Gochar 2023: జ్యోతిష్య గణనల ప్రకారం, ప్రతి గ్రహం నిర్దిష్ట వ్యవధిలో తన రాశిని మారుస్తుంది. ఈనెల మెుదటి వారంలో అంటే ఫిబ్రవరి 7, ఉదయం 7:38కి గ్రహాల రాకుమారుడు బుధుడు మకరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఫిబ్రవరి 27 వరకు బుధుడు అదే రాశిలో ఉంటాడు. బుధదేవుడు ప్రస్తుతం ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. మకరంలో బుధుడు గోచారం వల్ల కొన్ని రాశులవారు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. మకరరాశిలో బుధుడు సంచరించడం వల్ల ఏ రాశి వారికి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం. 

మకరరాశి (Capricorn): బుధుడి సంచారం వల్ల మకర రాశి వారికి అపారమైన ప్రయోజనాలు కలుగుతాయి. బుధుడు మకరరాశి నుండి లగ్న గృహంలో సంచరిస్తాడు. మీరు డబ్బును ఆదా చేస్తారు. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
కన్యారాశి (Virgo)- మకరరాశిలో మెర్క్యురీ సంచారం కన్యారాశివారిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మీ జాతకంలోని ఐదో ఇంట్లో బుధుడు సంచరిస్తున్నాడు. దీంతో మీ వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. సంతానం లేని దంపతులకు పిల్లలు కలుగుతారు.
తులారాశి (Libra)- బుధ సంచారం వల్ల తులరాశివారు శుభ ఫలితాలను పొందుతారు. బుధుడు తులారాశి యొక్క నాల్గవ ఇంటిలో సంచరిస్తాడు. దీంతో మీరు ఏదైనా ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. 
వృషభం (Taurus)- బుధగ్రహ సంచారం వృషభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ రాశిచక్రం యొక్క తొమ్మిదవ ఇంట్లో బుధుడు సంచరించబోతున్నాడు. దీని వ ల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మెుత్తానికి ఈ సమయం  మీకు అద్భుతంగా ఉంటుంది. 

Also Read: Malavya Yog 2023: ఫాల్గుణ మాసంలో మాళవ్య యోగం.. మీ రాశి ప్రకారం ఈ పరిహారాలు చేస్తే అద్భుత ప్రయోజనాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News