Budh Surya Gochar 2023: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల యువరాజు, గ్రహాల రాకుమారుడు, ఫ్లానెట్స్ ప్రిన్స్ అని రకరకాల పేర్లుతో పిలుస్తారు. బుధుడి గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. రేపు అంటే మార్చి 31వ తేదీ మధ్యాహ్నం 2.44 గంటలకు బుధుడు మేషరాశి ప్రవేశం చేయనున్నాడు. ఇది జరిగిన కొన్ని రోజులకు అంటే ఏప్రిల్ 14న సూర్యుడు మేషరాశిలోకి ఎంటర్ అవ్వనున్నాడు. మేషంలో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఈయోగం కొందరికి శుభప్రదంగా ఉండనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
సింహ రాశి
బుధుడు-సూర్యుడు కలయిక సింహ రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. మీ జీతం రెట్టింపు అవుతుంది. డబ్బును ఆదా చేస్తారు. మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో విజయం సాధిస్తారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. బిజినెస్ చేసే వారికి కూడా ఈ సమయం బాగానే ఉంటుంది.
కుంభం
కుంభ రాశి వారు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.
ధనస్సు రాశి
బుధుడు సంచారం ధనస్సు రాశి వారికి లాభాలను ఇస్తుంది. దంపతులకు పిల్లలు కలుగుతారు. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. మీరు భారీగా ధనాన్ని ఆర్జిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది.
మిథునం
మెర్క్యూరీ మేషరాశి ప్రవేశం మిథునరాశి వారికి చాలా మేలు చేస్తుంది. మీరు ఆర్థికంగా బలపడతారు. డబ్బు బాగా ఆదా చేస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ సమయంలో మీరు ఏదైనా విలువైనది కొనుగోలు చేసే అవకాశం ఉంది.
కర్కాటకం
బుధాదిత్య రాజయోగం వల్ల కర్కాటక రాశి వారి కెరీర్ దూసుకుపోతుంది. మీకు మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులు భారీగా లాభపడతారు. మీ ఫ్యామిలీ లైప్ బాగుంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీకు డబ్బుకు లోటు ఉండదు.
Also Read: Trigrahi Yog 2023: మేషరాశిలో త్రిగ్రాహి యోగం.. మార్చి 31 నుంచి ఈ మూడు రాశులకు కష్టాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి