Astrology: డిసెంబరులో 3 పెద్ద గ్రహాల సంచారం.. ఈ 4 రాశులవారి దశ తిరగడం పక్కా..

Astrology: వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, డిసెంబర్‌లో మూడు గ్రహాలు సంచరించబోతున్నాయి. ఈ గ్రహాల సంచారం 4 రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2022, 11:07 AM IST
  • బుధ, శుక్ర మరియు సూర్య గ్రహాల సంచారం
  • డిసెంబురులో ప్రకాశించనున్న ఈ రాశుల అదృష్టం
  • ఇందులో మీరున్నారేమో చెక్ చేసుకోండి
Astrology: డిసెంబరులో 3 పెద్ద గ్రహాల సంచారం.. ఈ 4 రాశులవారి దశ తిరగడం పక్కా..

Planet Transit In December 2022: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, కొన్ని గ్రహాలు ప్రతి నెలా రాశిని మారుస్తాయి. దీని ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. వచ్చే నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాలు తమ రాశులను మార్చనున్నాయి. డిసెంబరులో సూర్యుడు, బుధుడు మరియు శుక్రుడు సంచరించబోతున్నాయి. అయితే డిసెంబరులో శుక్రుడు, బుధుడు రెండుసార్లు తమ రాశులను ఛేంజ్ చేయనుండగా... సూర్యభగవానుడు ఒక రాశి మాత్రమే తన రాశిని మార్చనున్నాయి. దీంతో 4 రాశులవారు మంచి డబ్బును, కెరీర్ లో పురోగతిని  సాధిస్తారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

మేషం (Aries): డిసెంబర్ నెల మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ జాతకంలో సూర్య భగవానుడి స్థానం చాలా బలంగా ఉంటుంది. దీంతో మీరు పని మరియు వ్యాపారంలో మంచి విజయాన్ని సాధిస్తారు. ఈనెలలో మీ అదృష్టం ప్రకాశించనుంది. ఉద్యోగులు ఆఫీసులో కొత్త బాధ్యతలను తీసుకుంటారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 
కర్కాటకం (Cancer): డిసెంబర్ నెల కర్కాటక రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. సూర్యుడు మరియు చంద్రుల కలయిక మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు జీవితంలో సౌకర్యాలు మెరుగువుతాయి. మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయాల్లో ఉండే వారికి మంచి పదవికి దక్కుతుంది. 
సింహం (Leo): డిసెంబర్ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు ఈ నెలలో ఆకస్మిక ధన లాభం ఉంటుంది. పాతపెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. మీరు విదేశాలకు సంబంధించిన వ్యాపారం ద్వారా ప్రయోజనం పొందుతారు. ఈ నెలలో మీకు ప్రత్యేక ప్రయోజనాలను పొందనున్నారు. మీ బిజినెస్ విస్తరిస్తుంది. 
తుల రాశి (Libra): డిసెంబర్ నెలలో తుల రాశి వారు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారులు చేసే వారు భారీగా లాభపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. శుక్రుని సంచారం వల్ల మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. 

Also Read: అరుదైన రాజయోగం చేస్తున్న కుజుడు, శుక్రుడు.. ఈ మూడు రాశులకు ధనప్రాప్తి.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News