Mercury Transit 2024 in May: ఖగోళ శాస్త్రంలో గ్రహాలకు ఎంత ప్రాధాన్యత ఉందో, జ్యోతిష్యశాస్త్రంలో కూడా వాటికి అంతే ప్రాముఖ్యత ఉంది. ఒకప్పుడు నవగ్రహాలు ఉండేవి, ప్లూటోను గ్రహాల జాబితాను తొలగించడంతో ఇప్పుడు అష్టగ్రహాలు మాత్రమే ఉన్నాయి. ఇందులో సూర్యుడికి అతి దగ్గరగా ఉండే గ్రహం బుధుడు. ఇతడినే గ్రహాల యువరాజు, ఫ్లానెట్స్ ప్రిన్స్ అని రకరకాల పేర్లుతో పిలుస్తారు. బుధ గ్రహం యెుక్క కదలికలో ఏ చిన్న మార్పు వచ్చినా అది ప్రజలందరి జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మే 10న మెర్క్యూరీ మేషరాశి ప్రవేశం చేయబోతుంది. దీని కారణంగా మూడు రాశులవారు అదృష్టవంతులు కాబోతున్నారు.
కర్కాటక రాశి
మెర్క్యురీ రాశి మార్పు కర్కాటకరాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ వస్తుంది. మీకు అదృష్టం కలిసి వచ్చి ప్రతి పనిలో విజయం సాధిస్తారు. కెరీర్ లో పురోగతి సాధిస్తారు. వ్యాపారులు పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకునే అవకాశం ఉంది. వీరు ఇంతకముందు ఎప్పుడూ చూడని లాభాలను చూస్తారు. పేదరికం తొలగిపోయి ఆర్థికంగా మంచి పొజిషన్ కు చేరుకుంటారు.
ధనుస్సు రాశి
బుధ గ్రహం రాశి మార్పు ధనస్సు రాశివారికి లాభదాయకంగా ఉంటుంది. మీ సంపదలో విపరీతమైన పెరుగదల ఉంటుంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీ కుటుంబంలో ఆనందం తాండవిస్తోంది. ప్రేమికుల మధ్య గొడవలు ముగిసి కలిసిపోతారు. భార్యభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది. కష్టసుఖాల్లో ఒకరికొకరు పాలుపంచుకుంటారు. కెరీర్ కు సంబంధించిన శుభవార్త వినే అవకాశం ఉంది.
Also read: Shani Nakshatra Gochar: మే నెలలో నక్షత్రాన్ని మార్చబోతున్న శనిదేవుడు.. ఈ 3 రాశులకు డబ్బే డబ్బు..
మకర రాశి
మేషరాశిలోకి బుధుడు వెళ్లడం వల్ల మకరరాశి వారికి గోల్డెన్ డేస్ మెుదలవుతాయి. మీరు ఏ పని తలపెట్టినా అది విజయవంతం అవుతుంది. ఈ సమయంలో అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. మీరు భారీగా ఆస్తులు కొనుగోలు చేసే సూచనలు కనిపిస్తున్నాయాయి. మీకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుంటారు. మీరు పని లేదా వ్యాపార నిమిత్తం టూర్ కు వెళ్లే అవకాశం ఉంది.
Also read: Varuthini Ekadashi 2024: మే నెలలో ధనవంతులు కాబోతున్న రాశులు ఇవే.. మీది ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి