Buddha Purnima Effects On Zodiac Signs: సనాతన హిందూ ధర్మంలో వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమికు చాలా ప్రాముఖ్య ఉంది. ఎందుకంటే ఇదే రోజు బుద్ధుడు కూడా జన్మించాడు. కాబట్టి ఈ పౌర్ణమిని బుద్ధ పౌర్ణమి అని అంటారు. ఈ రోజునే బుద్ధుడు జ్ఞానోదయం పొందాడు. కాబట్టి ఈ పౌర్ణమికి హిందూ సంప్రదాయంలో గొప్ప ప్రాముఖ్యను కలిగి ఉంటుంది. ఈ సంవత్సరం రాబోతున్న బుద్ధ పౌర్ణమి రోజునే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది. కాబట్టి దీని ప్రభావం పలు రాశులవారిపై పడే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బుద్ధ పూర్ణిమ రాత్రి 8:45 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ చంద్రగ్రహణం తెల్లవారుజామున 1:00 గంటల వరకు ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా చంద్రగ్రహణం స్వాతి నక్షత్రంలో ఏర్పడుతుంది. దీని ప్రభావం పలు రాశులవారిపై పడబోతోంది. ఈ ప్రభావం ఏయే రాశులవారిపై పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారిపై బుద్ధ పూర్ణిమ ప్రభావం:
1. మేషం:
ఏప్రిల్ 14న సూర్యుడు మేషం రాశికి సంచారం చేశాడు. కాబట్టి ఈ రాశివారిపై బుద్ధ పూర్ణిమ ప్రభావం కూడా పడబోతోంది. ఈ పూర్ణిమ మేషరాశికి చాలా శుభప్రదంగా మారుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ పూర్ణిమ సందర్భంగా మేషరాశిలో బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. కాబట్టి ఈ రాశివారు ఉద్యోగ, వ్యాపారాలలో మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థికంగా బలపడతారు.
2. వృషభ రాశి:
వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ఇదే క్రమంలో చంద్రగ్రహణం ఏర్పడి ఈ రాశివారిపై ప్రభావం చూపబోతోంది. దీని కారణంగా ఈ రాశివారు ఆరోగ్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నిలిచిపోయిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. కాబట్టి తప్పకుండా జాగ్రత్తలతో పనులు నిర్వహించాల్సి ఉంటుంది.
Also read: Shani Jayanti 2023: శని జయంతి రోజు ఈ ఉపాయాలు పాటిస్తే శని దోషం, దుష్ప్రభావాల్నించి ఉపశమనం
3. మిథునరాశి:
మిథునరాశి వారిపై కూడా చంద్రగ్రహణ ప్రభావం పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో మీ మేధస్సును పదునుగా ఉంచుకోని పనులు చేయడం వల్ల మంచి లాభాలు పొందొచ్చు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. ప్రయాణాలు చేసే క్రమంలో తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
4. కర్కాటక రాశి:
కర్కాటక రాశి బుద్ధ పూర్ణిమ ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో వీరు చాలా అదృష్టాన్ని పొందుతారు. వ్యాపారాలు చేసేవారు ఈ క్రమంలో భారీగా లాభాలు పొందొచ్చు. ఈ క్రమంలో ఏదైన ప్రదేశాలను సందర్శించుకోవాలనుకునేవారి కోరిక నెరవేరుతుంది. అంతేకాకుండా వీరికి ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
5. సింహరాశి:
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు అధిపతిగా సూర్య గ్రహాన్ని పరిగణిస్తారు. కాబట్టి ఇదే క్రమంలో బుధుడితో సూర్యుడు కలబోతున్నాడు. కాబట్టి ఈ క్రమంలో ఈ రాశివారిపై కూడా ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరికి ఈ క్రమంలో ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ గ్రహణం కారణంగా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
Also read: Shani Jayanti 2023: శని జయంతి రోజు ఈ ఉపాయాలు పాటిస్తే శని దోషం, దుష్ప్రభావాల్నించి ఉపశమనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
High Protein FoodsHigh In Protein FoodsProtein FoodsWhat Is High In Protein