Ayodhya Rammandir Issue: అయోధ్య రామమందిరం చుట్టూ వివాదం, వ్యతిరేకిస్తున్న శంకరాచార్యులు

Ayodhya Rammandir Issue: అయోధ్య రామమందిరం మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. నూతన రామాలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. మరోవైపు దేశంలోని ప్రముఖ శంకరాచార్యులు ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 15, 2024, 01:37 PM IST
Ayodhya Rammandir Issue: అయోధ్య రామమందిరం చుట్టూ వివాదం, వ్యతిరేకిస్తున్న శంకరాచార్యులు

Ayodhya Rammandir Issue: అయోధ్య రామమందిరం ప్రారంభం చుట్టూ కొత్త వివాదం రాజుకుంటోంది. దేశమంతా అత్యంత ఆసక్తిగా గమనిస్తున్న రామమందిర ప్రారంభానికి నలుగురు శంకరాచార్యులు హాజరుకామని స్పష్టం చేయడమే కాకుండా ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ప్రపంచంలోని హిందూవులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరం ప్రారంభానికి మరో వారం రోజులే మిగిలుంది. ఆహ్వానం అందినవాళ్లంతా అదృష్టంగా భావిస్తూ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అదే సమయంలో కొత్త వివాదం కూడా మొదలైంది. దేశంలోని ప్రముఖ శంకరాచార్యులు నలుగురు ఈ కార్యక్రమాన్ని బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు. ఉత్తరాఖండ్ జ్యోతిష్య పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి, పూరీ గోవర్ధన్ పీఠం శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరసస్వతిలు ప్రాణ ప్రతిష్ట కార్కక్రమాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అదే విధంగా శృంగేరి పీఠాధిపతి స్వామి భారతీ కృష్ణాజీ, ద్వారకా పీఠాదిపతి స్వామి సదానంద్ మహారాజ్ కూడా వ్యతిరేకిస్తున్నారు. 

ఆలయం పూర్తి కాకుండా రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదంటున్నారు. ఇది హైందవ మతానికి వ్యతిరేకమంటున్నారు. అసంపూర్తిగా ఉన్న ఆలయంలో దేవుడిని ప్రతిష్ఠించడం మంచిది కాదంటున్నారు. అందుకే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వెళ్లలేమన్నారు. వేడుకలు జరుపుతున్న తీరు నచ్చడం లేదని, ఆ ఆచారాలతో విబేధించే తాము హాజరుకావడం లేదన్నారు. దేశ ప్రధాని ఆలయం లోపల ప్రాణ ప్రతిష్ఠ చేస్తుంటే తామంతా బయట వేడుక చూడాలనడం సరికాదన్నారు. అందుకే ఆహ్వానం అందినా సరే శంకరాచార్యులెవరూ హాజరు కావడం లేదన్నారు. శంకారాచార్యులకు ప్రత్యేక గౌరవం, హోదా ఉంటాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గర్భాలయంలో ప్రధాని మోదీ రాముడి ప్రాణ ప్రతిష్ఠ చేస్తుంటే తాము బయట ప్రేక్షకుల్లా కూర్చుని చూస్తుండాలా, ఆయనను పొగుడుతుండాలా అని పూరీ గోవర్ధన పీఠం స్వామి నిశ్చలానంద సరస్వతి మహారాజ్ స్పష్టం చేశారు. 

దేశంలో నలుగురు శంకరాచార్యులు ఈ వేడుకలకు హాజరుకాకాకూడదని నిర్ణయం తీసుకోవడంపై రాజకీయంగా చర్చనీయాంశమౌతోంది. ప్రతిపక్షాలు బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ఆలయం పూర్తిగా ప్రారంభం కాకుండానే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాల తలపెట్టారంటున్నారు. అయోధ్య వేడుకల్ని రాజకీయం చేయడం వల్లనే సనాతన ధర్మాన్ని కాపాడుతున్న శంకరాచార్యులు రావడం లేదని బాయ్‌కాట్ చేశారని కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ మండిపడ్డారు. 

Also read: Surya Gochar 2024 today: మకర సంక్రాంతి నుండి నెల రోజులపాటు వీరికి డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు.. ఇందులో మీ రాశి ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News