జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఓ వ్యక్తి కుండలిలో ఏదైనా గ్రహం బలహీనంగా ఉంటే ఆ వ్యక్తి చాలా రకాల సమస్యల్ని ఎదుర్కోవల్సి వస్తుంది. జ్యోతిష్యం ప్రకారం బుధుడు బలంగా ఉంటే..వారికి ఉద్యోగ, వ్యాపార, విద్యా రంగాల్లో అంతా అదృష్టమే. ప్రతి రంగంలోని విజయం లభిస్తుంది. బుధుడు బలహీనంగా ఉంటే మాత్రం ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనేక సమస్యల్ని ఎదుర్కోవల్సి వస్తుంది.
మతగ్రంధాల ప్రకారం బుధవారం రోజు కొన్ని జ్యోతిష్య ఉపాయాలు ఆచరిస్తే వ్యక్తి జీవితంలో ప్రతి పనిలో విజయం లభిస్తుంది. వ్యక్తి అదృష్టం మెరిసిపోతుంది. ఆ వ్యక్తికి వ్యాపారం, ఉద్యోగం, విద్యా రంగాల్లో సఫలత లభిస్తుంది. బుధుడు బలంగా ఉంచేందుకు కొన్ని ఉపాయాలున్నాయి.
బుధగ్రహాన్ని బలంగా ఉంచే ఉపాయాలు
How to strengthen mercury
జ్యోతిష్యం ప్రకారం బుధవారం రోజు ఉపవాసం ఆచరించాలి. ఈ రోజున ఉపవాసముంటే కనీసం 17 బుధవారాలు ఆచరించాలి. అంతేకాదు..21 లేదా 45 బుధవారాలు కూడా చేయవచ్చు. ఆ రోజు ఎర్ర బట్టలు ధరించాలి. కనీసం 3 మాలల ఓమ్ బ్రాం బ్రీం బ్రౌ నమహ మంతాన్ని జపించాలి. దీనివల్ల బుధుడు బలోపేతమౌతాడు. ఆ వ్యక్తికి ధనలాభముంటుంది.
బుధవారం నాడు పెసలతో చేసిన పదార్ధాలు తినాలి. ఈ రోజు ఉప్పుకు దూరంగా ఉండాలి. పెసలతో చేసిన హల్వా,, పెసరట్టు, పెసర లడ్డూ తినవచ్చు. ఈ పద్ధతి పాటించడం వల్ల వ్యక్తి వ్యాపారంలో ఉన్నతి లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఎవరైనా వ్యక్తి జాతకంలో బుధుడు కుండలిలో బలహీనంగా ఉంటే ఆ వ్యక్తులు బంగారం, బట్టలు, పూలు దానం చేయాలి. ఇవి సాధ్యం కాకపోతే నీలం రంగు బట్టలు, పెసలు, కాంస్యపు వస్తువులు, పండ్లు దానం చేయాలి.
కుండలిలో బలహీనంగా ఉన్న బుధుడిని బలోపేతం చేయాలంటే..దీనికోసం రత్నశాస్త్రం ప్రకారం ఎమెరాల్డ్ రత్నాన్ని ధరించాలి. అయితే సరైన జ్యోతిష్యుడి సలహా మేరకే ఇది ధరించాలి.
బుధుడిని కుండలిలో పటిష్టంగా మార్చేందుకు జ్యోతిష్యశాస్త్రంలో చాలా ఉపాయాలున్నాయి. ఆ రోజున ఆవుకు పచ్చి గడ్డి తినిపించాలి. అంతేకాకుండా ఆ రోజు పచ్చరంగు ఇలాచీ తినాలి. ఇంట్లో పచ్చరంగు మొక్కలు నాటాలి. ఇలా చేయడం వల్ల కుండలిలో బుధుడు బలోపేతమౌతాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook