Rahu Ketu Remedies on Ugadi 2023: ఉగాది చైత్ర నవరాత్రుల్లో ఇలా చేస్తే.. జీవితంలో ఎప్పుడూ మీపై రాహుకేతువు ప్రభావం ఉండదు!

Rahu Ketu Dosham Remedies on Ugadi 2023: హిందూమతంలో జ్యోతిష్యం ప్రకారం అన్ని సమస్యలకు పరిష్కార మార్గాలున్నాయి. కుండలిలో రాహు కేతువులు దోషముంటే ఆ వ్యక్తికి నరకం ఎదురౌతుందంటారు. అయితే చైత్ర నవరాత్రి నాడు కొన్ని ఉపాయాలు పాటించడం ద్వారా ఈ పరిస్థితి నుంచి గట్టెక్కవచ్చంటున్నారు జ్యోతిష్య పండితులు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 20, 2023, 01:11 PM IST
Rahu Ketu Remedies on Ugadi 2023: ఉగాది చైత్ర నవరాత్రుల్లో ఇలా చేస్తే.. జీవితంలో ఎప్పుడూ మీపై రాహుకేతువు ప్రభావం ఉండదు!

Rahu Ketu Dosham Remedies on Ugadi 2023: హిందూ పంచాంగం ప్రకారం కుండలిలో రాహుకేతువులుండటం అత్యంత నష్టదాయకంగా భావిస్తారు. చాలా రకాల సమస్యలు వెంటాడుతుంటాయి. అయితే కొన్ని ఉపాయాలు పాటిస్తే ఈ సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

కుండలిలో రాహుకేతువులు ఉండటం వల్ల ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు ఎదురౌతాయి. కెరీర్ సక్సెస్ కాదు. ప్రేమ లోపిస్తుంది. ఇలా చాలా రకాల సమస్యలు పట్టిపీడిస్తుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే జీవితం నరకప్రాయంగా ఉంటుందంటారు. అందుకే మార్చ్ 22 నుంచి ప్రారంభమై మార్చ్ 30 వరకూ ఉండే చైత్ర నవరాత్రి నాడు కొన్ని ఉపాయాలు ఆచరించడం ద్వారా రాహుకేతువుల ప్రభావం తగ్గించవచ్చని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. నవరాత్రి నాడు దుర్గాదేవి పూజలు చేయడం వల్ల నవగ్రహాలు శాంతిస్తాయి. అంతేకాకుండా అశుభ ప్రభావాలు కూడా దూరమౌతాయి. కుండలిలో రాహుకేతువుల ప్రభావం కూడా పోతుంది. అన్ని సమస్యల్నించి గట్టెక్కుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.

చంద్రఘంటా దేవి, బ్రహ్మచారిణీ దేవి పూజలు:

ఏ వ్యక్తి కుండలిలోనైనా రాహుదోషముంటే..ఆ వ్యక్తి బ్రహ్మచారిణి దేవిని పూర్తి విధి విధానాలతో, భక్తి శ్రద్ధలతో పూజించాలి. కేతువు సమస్య పీడిస్తుంటే చంద్రఘంటా దేవీని ఆరాధించాలి. నవరాత్రి సమయంలో ఈ దేవతల్ని పూజించడం వల్ల రాహుకేతువుల అశుభ ప్రభావం నుంచి విముక్తి పొందుతారు. 

చందనం పౌడర్:

ఒకవేళ స్నానం చేసే నీళ్లలో చందనం పౌడర్ కలుపుకుని స్నానం చేస్తే..కుండలిలో రాహువు దోషం తొలగిపోతుందంటారు. నవరాత్రి నుంచి ఈ ఉపాయాల్ని ప్రారంభించి..వరుసగా మూడు నెలలవరకూ చేయాలి. ఇలా చేయడం వల్ల కష్టాలు తొలగిపోవడమే కాకుండా ఇతర ప్రయోజనాలు కలుగుతాయి.

హనుమాన్ పూజ:

నవరాత్రి నాడు దుర్గాదేవితో పాటు హనుమంతుడిని, శివుడిని పూజించడం వల్ల రాహు కేతువులు ఇబ్బంది పెట్టవంటారు. ఒకవేళ నవరాత్రి సమయంలో మీరు ప్రతిరోజూ శివ సహస్రనామం, హనుమాన్ సహస్రనామం పఠిస్తే కుండలిలో రాహుకేతువుల నెగెటివ్ ప్రభావం తొలగిపోతుంది. 

రాహుకేతువుల దోషం నుంచి విముక్తి పొందాలనుకుంటే నవరాత్రి సమయంలో వెండి ఏనుగు బొమ్మ కొనుగోలు చేయాలి. దీనికి పూజామందిరంలో లేదా ఇంటి ఖజానాలో ఉంచాలి. ప్రతిరోజూ దర్శనం చేసుకోవాలి. దీనివల్ల కుండలిలో రాహువు చెడు ప్రభావం తొలగిపోతుంది. కెరీర్‌లో ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు. 

దుర్గా సప్తశతి పాఠాన్ని చైత్ర నవరాత్రి 9 రోజులు పఠించడం వల్ల రాహుకేతువుల చెడు ప్రభావం పోతుంది. దుర్గా సప్తశతి పఠించడం వల్ల దుర్గాదేవి ప్రసన్నమవడమే కాకుండా..భక్తులపై  ఈ రెండు పాపి గ్రహాల వక్రదృష్టి పడదు.

Also read: Black Thread Remedies: నల్లదారం కట్టుకోవడం వల్ల ఈ సమస్యలు దూరమౌతాయట, ఎలా కట్టుకోవాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News