September Horoscope 2023: సెప్టెంబర్ నెల ఈ మూడు రాశులవారికి ఎలా ఉంటుంది, ధనలాభముందా

September Horoscope 2023: జ్యోతిష్యం ప్రకారం ప్రతి నెలకు ప్రాధాన్యత, విశిష్టత ఉంటుంది. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుండటం వల్ల మొత్తం 12 రాశులపై ప్రభావం పడుతుంటుంది. ఈ ప్రభావం ప్రతి నెలా మారే అవకాశాలున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 10, 2023, 07:53 AM IST
September Horoscope 2023: సెప్టెంబర్ నెల ఈ మూడు రాశులవారికి ఎలా ఉంటుంది, ధనలాభముందా

September Horoscope 2023: ఈ క్రమంలో సెప్టెంబర్ నెలలో వివిధ రాశులపై ప్రభావం వేర్వేరుగా ఉండనుంది. ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో మూడు రాశులపై ప్రభావం శుభప్రదంగా ఉంటుందంటున్నారు జ్యోతిష్య పండితులు. ఈ సమయంలో ఈ రాశివారికి మహర్దశ ఉంటుందట.

మకరం, కుంభం, మీన రాశి జాతకులకు సెప్టెంబర్ నెలలో పరిస్థితి చాలావరకూ అనుకూలంగానే ఉండనుంది. ముఖ్యంగా మకర రాశి జాతకులకు ఈ నెలలో ఆర్ధిక సమస్యలు చుట్టుమట్టి..కుటుంబపరంగా ఒత్తిడి ఎదుర్కోవల్సి వస్తుందంటున్నారు. ఇక కుంభ రాశి జాతకులకైతే ఆర్ధికంగా మంచి స్థితి ఉంటుంది. ఇళ్లు, వాహనం కొనుగోలు చేయవచ్చు. మీన రాశి జాతకులకు సెప్టెంబర్ నెల మిశ్రమంగా ఉండనుంది. 

సెప్టెంబర్ నెలలో కుంభ రాశి జాతకుల జీవిత భాగస్వామి అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురు కావచ్చు. లగ్జరీ జీవితాన్ని నియంత్రించుకోకపోతే ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. ఇళ్లు, వాహనం వంటి అవసరాలు తీర్చుకునే అవకాశముంది. చిన్న చిన్న విషయాలపై పంతానికి పోతే సమస్యలు ఎదురౌతాయంటున్నారు. అందుకే ఈ సమయంయలో సాధ్యమైనంతవరకూ వివిధ విషయాల్లో సంయమనం పాటించాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగులు, వ్యాపారులకు చాలావరకూ అనుకూలమనే చెప్పాలి.

సెప్టెంబర్ నెలలో మీన రాశి జాతకులకు కొన్ని అంశాల్లో సమస్యలు ఎదురుకావచ్చు. ఈ నెలలో ఖర్చులు పెరగవచ్చంటున్నారు. కుటుంబసభ్యుల మధ్య విబేధాలు తలెత్తకుండా ఆ కుటుంబ యజమాని అన్ని జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. కుటుంబీకులతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. ఆర్ధికంగా ఫరవాలేదు. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఉద్యోగులు, వ్యాపారులకు ఆదాయం వృద్ధి చెందుతుంది.

ఇక సెప్టెంబర్ నెలలో మకర రాశి జాతకులకు ఆర్ధికంగా సమస్య రావచ్చు. ఎందుకంటే ఖర్చులు పెరిగిపోతాయి. ఇంట్లో కుటుంబీకుల ఆరోగ్యం విషయంలో లేదా ఇతరత్రా ఊహించని ఖర్చుల కారణంగా ఆదాయం సరిపోక ఇబ్బందులు రావచ్చు. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే కుటుంబ సభ్యుల మధ్య అంతరం పెరగవచ్చు. ఇంట్లో ఏదైనా విలువైన వస్తువు పోగొట్టుకోవచ్చు. ప్రయాణాల్లో అయితే ధనహాని కలగవచ్చు. ఉద్యోగులు, వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా అప్రమత్తత అవసరం. 

Also read: Sunday Astro Rules: ఆదివారమైతే చాలు మీరంతా చేసే ఈ పనులు నిషిద్ధమంటున్నారు జ్యోతిష్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News