Astro Remedies: నిద్రపోయేటప్పుడు దిండు కింద ఈ వస్తువు పెట్టుకుంటే... లక్ష్మీదేవి మీ వెంటే..!

Astro Tips: జ్యోతిషశాస్త్రంలో గ్రహ దోషాలను తొలగించడానికి కొన్ని సులభమైన పరిహారాలు చెప్పబడ్డాయి.  ఇందులో ఒక చిట్కా దిండు కింద ఏదైనా వస్తువును పెట్టుకుని పడుకోవడం. ఇలా చేయడం వల్ల మీ కెరీర్ లోని అడ్డంకులన్నీ తొలగిపోతాయి.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 1, 2022, 10:59 AM IST
Astro Remedies: నిద్రపోయేటప్పుడు దిండు కింద ఈ వస్తువు పెట్టుకుంటే... లక్ష్మీదేవి మీ వెంటే..!

Astro Tips for Success : మీ జాతకంలో గ్రహ దోషాలు, ఇంటి వాస్తు దోషం కారణంగా మిమ్మల్ని అనేక సమస్యలు చుట్టిముడతాయి.  దీంతో మీరు మానసికంగా, శారీరకంగా కుంగిపోతారు. ఈ ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఆస్ట్రాలజీలో కొన్ని చిట్కాలు (Astro Tips for Success) చెప్పబడ్డాయి. అవి నిద్రపోయే ముందు చేయాలి. ఇవి పాటిస్తే మీ జీవితం బిందాస్ గా ఉంటుంది. 

ఈ వస్తువులను దిండు కింద పెట్టుకుని పడుకోండి..
>> మీ కెరీర్ లో పురోగతి లేకపోతే నిద్రపోయే ముందు భగవద్గీత లేదా సుందరకాండను దిండు కింద పెట్టుకుని పడుకోండి. ఇలా చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా మీరు పాజిటివ్ గా ఆలోచిస్తారు. కెరీర్ లో రాణిస్తారు. 
>> జాతకంలో రాహుదోషం ఉన్నవారు రాత్రిపూట దిండు కింద ముల్లంగిని పెట్టుకుని నిద్రించాలి. ఉదయాన్నే శివలింగంపై ఈ ముల్లంగిని సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. 
>> నిద్రలేమి, ఒత్తడి వంటి సమస్యలతో బాధపడేవారు దిండు కింద ఇనుప కీ లేదా కత్తెరతో పెట్టుకుని నిద్రపోండి. దీంతో రాహు-కేతువుల దుష్ప్రభావం అంతమై మీ సమస్యలన్నీ తొలగిపోతాయి.
>> మీ జాతకంలో కుజ దోషం ఉంటే దిండు కింద కుంకుమ పెట్టె ఉంచి నిద్రించండి. దీనిని తర్వాత రోజు హనుమంతుడికి సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీ ఆదాయం పెరుగుతుంది, ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. 

Also Read: కన్యారాశిలో బుధ సంచారం... ఈ రాశుల వారికి ధనప్రాప్తి, కెరీర్ లో పురోగతి.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News