Black Thread Remedies: నల్లదారం కట్టుకోవడం వల్ల ఈ సమస్యలు దూరమౌతాయట.. ఎలా కట్టుకోవాలి..?

Black Thread Remedies: జ్యోతిష్యశాస్త్రంలో  వివిధ సమస్యలకు పరిష్కారంగా ఎన్నో ఉపాయాలున్నాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం మంత్రాలు తంత్రాలతో ఎదురయ్యె దుష్పరిణామాల్నించి విముక్తకి పొందే మార్గాలున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 20, 2023, 12:22 PM IST
Black Thread Remedies: నల్లదారం కట్టుకోవడం వల్ల ఈ సమస్యలు దూరమౌతాయట.. ఎలా కట్టుకోవాలి..?

Black Thread Remedies: జ్యోతిష్యశాస్త్రంలో సూచించే కొన్ని ఉపాయాలు కొంతమందికి మూఢ నమ్మకంగా అన్పించవచ్చేమో గానీ చాలామంది విశ్వసిస్తుంటారు. అటువంటి కొన్ని పద్ధతుల్లో ఒకటి నల్లదారం కట్టుకోవడం. నల్లదారం కట్టుకోవడం వల్ల అద్భుతమైన లాభాలున్నాయంటున్నారు జ్యోతిష్య పండితులు.

చాలామంది మెడలో, చేతులకు లేదా కాళ్లకు నల్లదారం కట్టుకోవడం చూస్తుంటాం. ఇంకొంతమంది నడుముకు కట్టుకుంటుంటారు. జ్యోతిష్యం, రెడ్ బుక్, మంత్ర తంత్రాల్లో నల్లదారం కట్టడం వల్ల చాలా లాభాలు కలుగుతాయి. దీనివల్ల చాలా రకాల ఇబ్బందుల్నించి కష్టాల్నించి రక్షించుకోవచ్చని నమ్మకం. దాంతోపాటు లాభాలు కూడా ఉన్నాయని నమ్ముతారు. ప్రత్యేకించి కొంతమంది నల్లదారం కట్టుకోవడం అన్ని విధాలా మంచిదంటారు. 

నల్లదారం ధరించడం వల్ల కలిగే లాభాలు:

  • నల్లరంగు అనేది శని గ్రహానికి సంబంధించింది. నల్లదారం ధరించడం వల్ల కుండలిలో శని పటిష్టంగా ఉంటాడు. దాంతోపాటు శని దుష్ప్రభావాల్నించి ఉపశమనం లభిస్తుంది. శనిదోషం ఉన్నవాళ్లు నల్లదారం కట్టుకుంటే కష్టాల్నించి విముక్తి పొందవచ్చు.
  • శనిదోషం నుంచి విముక్తి పొందేందుకు మెడ లేదా చేతులకు నల్లదారం కట్టుకోవాలి. దీనివల్ల చాలా ఉపశమనం లభిస్తుంది. నెగెటివ్ శక్తుల్నించి రక్షింపబడతారు. 
  • గర్భిణీ మహిళలు దారానికి 7 ముడులు వేసి కాళ్లకు ధరించాలి. దీనివల్ల గర్భధారణ సమయంలో ఎదురయ్యే నొప్పులు తగ్గుతాయి. దాంతోపాటు నెగెటివ్ శక్తుల్నించి రక్షించుకోవచ్చు.
  • పనిచేసేచోట ప్రత్యర్ధులు లేదా మీరంటే పడనివారు మీకు హాని కల్గిస్తుంటే..భుజాలకు నల్లదారం కట్టుకోవాలి. ఇలా చేస్తే ప్రత్యర్ధుల ప్రభావం మీపై పడదు.
  • చాలా ప్రాంతాల్లో పెళ్లి కూతురికి నల్లదారం లేదా నల్ల చున్ని ధరింపజేస్తారు. ఎందుకంటే పెళ్లి కూతురుకు దిష్టి తగలకుండా ఉండాలని. తద్వారా కొత్త జీవితం ఆనందంగా గడుపుతుందని నమ్మకం. సుఖమైన దాంపత్య జీవితం గడుపుతారు. 
  • తరచూ ఆరోగ్యం పాడవుతుంటే..లేదా ఏదైనా తీవ్రమైన వ్యాధి బారిన పడితే చికిత్స చేయించడంతో పాటు నడుముకు నల్లదారం కట్టుకోవాలి. దీనివల్ల నెగెటివ్ శక్తులు దరిచేరవు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. 
  • ఒకవేళ జీవితంలో తరచూ కష్టాలు, ఇబ్బందులు ఎదురవుతుంటే..చేతికి నల్లదారం కట్టుకుంటే మంచి ఫలితాలుంటాయి. అన్ని సమస్యలు దూరమౌతాయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

Also Read: Mars Transit 2023: మంగళ గ్రహం గోచారంతో ఈ 5 రాశుల జీవితాల్లో 69 రోజులు తిరుగుండదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News