Snake Plant Vastu: స్నేక్ ప్లాంట్  ఈ దిశలో పెడితే ఆ ఇంట డబ్బేడబ్బు..

Snake Plant Vastu: సాధారణంగా మనం మొక్కలు ఎక్కువ శాతం అవుట్ డోర్ మొక్కలు నాటుతాం. కరోనా తర్వాత ఆక్సిజన్ ప్లాంట్స్ వైపు అందరి దృష్టి మళ్లింది. అవును.. కొన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ ఇంట్లోకి ఆక్సిజన్ విడుదల చేస్తాయి.

Written by - Renuka Godugu | Last Updated : Mar 31, 2024, 04:22 PM IST
Snake Plant Vastu: స్నేక్ ప్లాంట్  ఈ దిశలో పెడితే ఆ ఇంట డబ్బేడబ్బు..

Snake Plant Vastu: సాధారణంగా మనం మొక్కలు ఎక్కువ శాతం అవుట్ డోర్ మొక్కలు నాటుతాం. కరోనా తర్వాత ఆక్సిజన్ ప్లాంట్స్ వైపు అందరి దృష్టి మళ్లింది. అవును.. కొన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ ఇంట్లోకి ఆక్సిజన్ విడుదల చేస్తాయి. ఇవి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కూడా ఇస్తాయి. ఎక్కువ శాతం అందరి ఇళ్లలో తులసి, కలబంద మొక్కలు చూస్తాం. అంతేకాదు తీగమొక్క అయిన మనీప్లాంట్ మొక్కను కూడా నాటుకుంటారు. వాస్తు ప్రకారం కూడా ఈ మొక్కలు ఇంట్లో ఉండాలి. అయితే, తులసి అవుట్‌డోర్ మొక్క కలబంద ఇండోర్ ,అవుట్ డోర్ ప్లాంట్‌ అయితే, ఇవి కాకుండా స్నేక్ ప్లాంట్‌ ఉంటుంది. ఇది కూడా ఇండోర్ మొక్క. ఈ మొక్క మన ఇంటికి లేదా ఆఫీసుకు అందాన్ని తెస్తుంది. అంతేకాదు ఇది మన ఇంటి పరిసరాలకు కావాల్సిన ఆక్సిజన్‌ ను కూడా విడుదల చేస్తుంది. వాస్తు ప్రకారం కూడా ఈ మొక్క ఇంట్లో పెట్టుకోవడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

ఇదీ చదవండి: ఇంట్లో మూడు బర్నర్ లు ఉన్న గ్యాస్ స్టవ్ ఉండవచ్చా..?.. జ్యోతిష్యుల మాటిదే..

స్నేక్ ప్లాంట్‌ ఉన్న ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అంటారు. అయితే, అన్ని మొక్కలకు వాస్తు దిశ కూడా ముఖ్యం. మనం ఎలా అయితే, వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకుంటామో వాస్తు ప్రకారం ఇంట్లోని వస్తువులు కూడా అమర్చుకుంటాం. నాలుగు దిక్కులు పంచభూతాలతో సంబంధం కలిగి ఉంటాయి. అలాగే మొక్కలు నాటుకునే టప్పుడు కూడా వాస్తు నియమం అనుసరించి పెట్టుకోవాలి. వాస్తు ప్రకారం తులసి మొక్క ఇంట్లో ఈశాన్యం లేదా తూర్పు దిశలో ఏర్పాటు చేసుకుంటారు. ఇలానే మనీప్లాంట్‌ నియమం కూడా ఉంటుంది. అయితే, మనీప్లాంట్‌ మొక్క ఎప్పుడూ నేలకు తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి. దీన్ని పైకి వేళాడదీయాలి. వాస్తు నియమం స్నేక్ మొక్కకు కూడా వర్తిస్తుంది. ఈ నియమం ప్రకారం ఇంట్లో స్నేక్ మొక్క దక్షిణ దిశలో ఉండాలి. ఈ దిశలో మొక్క పెట్టుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది.

ఇదీ చదవండి: ఈ 8 శక్తివంతమైన శ్రీరాముని మంత్రాలు పఠిస్తే సంపద- విజయం మీసొంతం..

అంతేకాదు ఈ మొక్కను ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల సంబంధం బలపడుతుంది. కుటుంబంలో సఖ్యత నెలకొంటుంది. ఈ స్నేక్ ప్లాంట్‌ మొక్కను బెడ్‌రూం లేదా బాత్రూంలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.  ఈ మొక్కను మంచి డెకరేషన్ మొక్కగా కూడా పెట్టుకోవచ్చు. ఇది ఉన్న చుట్టు పరిసర ప్రాంతాల్లో ఆక్సిజన్ వీస్తుంది. దీంతో ఇంట్లో సహజ ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. వాస్తు ప్రకారం ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంటే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని గ్రహించి పాజిటివ్ ఎనర్జీని విడుదల చేస్తుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News