Aja Ekadashi 2022: అజ ఏకాదశి ఎప్పుడు? పూజ ముహూర్తం, పారణ సమయం, ప్రాముఖ్యత తెలుసుకోండి

Aja Ekadashi 2022: భాద్రపద మాసంలో వచ్చే కృష్ణ పక్ష ఏకాదశినే అజ ఏకాదశి అంటారు. అజ ఏకాదశి ఎప్పుడు, శుభ ముహూర్తం తదితర వివరాలు మీ కోసం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 13, 2022, 09:19 AM IST
Aja Ekadashi 2022:  అజ ఏకాదశి ఎప్పుడు? పూజ ముహూర్తం, పారణ సమయం, ప్రాముఖ్యత తెలుసుకోండి

Aja Ekadashi 2022 Date:  భాద్రపద మాసంలో వచ్చే కృష్ణ పక్ష ఏకాదశినే అజ ఏకాదశి (Aja Ekadashi 2022) అంటారు. ఈ రోజున ఉపవాసం ఉండి.... శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల సర్వపాపాలు నశిస్తాయి. ఈ వ్రతం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. అజ ఏకాదశి ఎప్పుడు, శుభముహూర్తం గురించి తెలుసుకుందాం.  

అజ ఏకాదశి తేదీ

పంచాంగం ప్రకారం, భాద్రపద మాసం కృష్ణ పక్ష ఏకాదశి ఆగస్టు 22, సోమవారం తెల్లవారుజామున 03:35 గంటలకు ప్రారంభమై.. 23వ తేదీ మంగళవారం ఉదయం 05:06 గంటలకు ముగుస్తుంది. ఈ రోజు సూర్యాస్తమయం 5:54 గంటలకు జరుగుతుంది. ఉదయతిథి ఆధారంగా ఆగష్టు 23న అజ ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. 

అదే రోజు రెండు శుభయోగాలు
అజ ఏకాదశి రోజునే సిద్ధి మరియు త్రిపుష్కర యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ రెండు యోగాలూ పూజా పరంగా శుభప్రదమైనవి. ఆగస్టు 23న ఉదయం నుంచి మధ్యాహ్నం 12.38 వరకు సిద్ధి యోగం. మరోవైపు, త్రిపుష్కర యోగం ఆగస్టు 24 ఉదయం 10:44 నుండి ఉదయం 05:55 వరకు ఉంటుంది.

ఏకాదశి పూజ సమయాలు
ఆగష్టు 23న ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారు ఉదయాన్నే శ్రీమహావిష్ణువును పూజించాలి. ఆ సమయంలో సిద్ధి యోగం, త్రిపుష్కర యోగం ఉంటాయి. ఈ రోజున రాహుకాలం మధ్యాహ్నం 03:38 నుండి 05:15 వరకు.

అజ ఏకాదశి ఉపవాస సమయం
అజ ఏకాదశి వ్రతం పాటించేవారు ఆగస్టు 24వ తేదీ ఉదయం 05:55 గంటల నుండి 08:30 గంటల వరకు వ్రతాన్ని పూర్తి చేయాలి. ఈ రోజున, ద్వాదశి తిథి ఉదయం 08:30 వరకు మాత్రమే. ఆరోగ్య కారణాల వల్ల ఏకాదశి ఉపవాసం ఉండలేని వారు అజ ఏకాదశి ఉపవాస కథను వినండి లేదా చదవండి. దీని వల్ల అశ్వమేధ యాగంతో సమానమైన పుణ్యం లభిస్తుంది.

Also Read: Sun Transit effect on Scorpio: సూర్యుడి రాశి మార్పు.. ఆగస్టు 17 నుండి ఈ రాశివారికి డబ్బే డబ్బు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News