Aja Ekadashi 2022: అజ ఏకాదశి ఎప్పుడు? పూజ చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తించుకోండి

Aja Ekadashi 2022:  అజ ఏకాదశి వ్రతం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని కృష్ణ పక్షం ఏకాదశి తిథి నాడు ఆచరిస్తారు. ఈ సంవత్సరం అజ ఏకాదశి వ్రతం ఆగస్ట్ 23 మంగళవారం నాడు జరుపుకోనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 21, 2022, 12:58 PM IST
Aja Ekadashi 2022: అజ ఏకాదశి ఎప్పుడు? పూజ చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తించుకోండి

Aja Ekadashi 2022: హిందూమతంలో అజ ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంది. భాద్రపద మాసంలోని కృష్ణపక్ష ఏకాదశి నాడు ఈ ఏకాదశిని జరుపుకుంటారు. ఈసారి అజ ఏకాదశి (Aja Ekadashi 2022) ఆగస్టు 23న జరుపుకోనున్నారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజిస్తారు. అజ ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల ఇంట్లో ధనధాన్యాలు, సిరి సంపదలు పెరుగుతాయని నమ్ముతారు. భక్తుల పాపాలన్నీ నశిస్తాయి. 

శుభ ముహూర్తం
పంచాంగం ప్రకారం, ఏకాదశి తేదీ ఆగస్టు 22 సోమవారం తెల్లవారుజామున 3.35 గంటలకు ప్రారంభమై.. 23 ఆగస్టు 2022 ఉదయం 6.06 గంటల వరకు ఉంటుంది. 

అజ ఏకాదశి వ్రత నియమాలు
>> అజ ఏకాదశి వ్రతం రోజున సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి ఉపవాస దీక్షను తీసుకోవాలి.  
>> అజ ఏకాదశి వ్రతం రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజించండి.
>> ఉపవాసం రోజున ఎవరితోనూ పరుషమైన మాటలు, దూషణలు చేయవద్దు.
>> అజ ఏకాదశి రోజు రాత్రి జాగరణ ఉండండి.  విష్ణువును ధ్యానిస్తూ భజనలు, కీర్తనలు మరియు అతని మంత్రాలను జపించండి.

Also read: August 4th Week Festivals 2022: ఈ వారంలో వచ్చే వ్రతాలు, పండుగలు ఏంటో తెలుసా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News