Achala Ekadashi 2022: అచల ఏకాదశి రోజున విష్ణువును పూజించడం వల్ల కలిగే శుభఫలితాలు ఏంటి?

Apara Ekadashi 2022 : అన్ని ఏకాదశులలో అచల ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంది. దీనిని అపర ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి కూడా విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ ఏడాది అచల ఏకాదశి నాడు రెండు పవిత్రమైన యోగాలు ఏర్పడుతున్నాయి.  

Edited by - ZH Telugu Desk | Last Updated : May 24, 2022, 04:23 PM IST
Achala Ekadashi 2022: అచల ఏకాదశి రోజున విష్ణువును పూజించడం వల్ల కలిగే శుభఫలితాలు ఏంటి?

Achala Ekadashi 2022: హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలలో రెండు ఏకాదశిలు ఉంటాయి. ఈ ఏకాదశులన్నీ  శ్రీమహావిష్ణువును పూజించడానికి ఉత్తమమైనవిగా భావిస్తారు. ఈ ఏకాదశిలలో కొన్ని ప్రత్యేకమైనవి ఉన్నాయి. అందులో ఒకటి అచల ఏకాదశి (Achala Ekadashi 2022). ఇది జ్యేష్ఠ మాసంలో వస్తుంది. అచల ఏకాదశి ఉపవాసం పాటించడం ఎంతో మంచిది.  మహాభారత కాలంలో... శ్రీకృష్ణుడు ధర్మరాజుకి ఈ ఉపవాసాన్ని పాటించి, విష్ణువు మరియు లక్ష్మీదేవిని పూజించమని సలహా ఇచ్చాడు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల జీవితంలో ఎనలేని సంతోషం, ఐశ్వర్యం కలుగుతాయి. 

అచల ఏకాదశి ఎందుకు ప్రత్యేకమంటే..
జ్యేష్ఠ మాసంలోని కృష్ణ పక్షంలోని ఏకాదశిని అచల లేదా అపర ఏకాదశి (Apara Ekadashi 2022) అంటారు. ఈసారి ఏకాదశి తేదీ మే 25, బుధవారం ఉదయం 10:32 గంటలకు ప్రారంభమై... మే 26, గురువారం ఉదయం 10:54 గంటల వరకు ఉంటుంది. మే 26వ తేదీ ఏకాదశి ఉత్సవం కావున ఈ రోజు ఉపవాసం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అదే సమయంలో, అచల ఏకాదశి నాడు చాలా ప్రత్యేకమైన యాదృచ్చికాలు ఏర్పడుతున్నాయి. ఈ రోజున ఆయుష్మాన్ యోగం, గజకేసరి యోగం ఏర్పడుతున్నాయి. ఈ యోగాలు ఉపవాసం, పూజలు మరియు శుభ కార్యాలు చేయడానికి చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. 

ఒక రాశిలో 3 గ్రహాలు ఉంటాయి
మే 26న అచల ఏకాదశి రోజున మీనరాశిలో గురుడు, చంద్రుడు, కుజుడు వంటి 3 ముఖ్యమైన గ్రహాలు కలిసి ఉంటాయి. ఈ త్రిగ్రాహి యోగం గజకేసరి యోగాన్ని ఏర్పరుస్తుంది. ఇది జ్యోతిషశాస్త్రంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున రేవతి నక్షత్రం కూడా ఉంది. ఇది కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. ఆ రోజున శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని భక్తితో పూజించండి.

Also Read: Money Plant: మనీ ప్లాంట్ కు కొద్దిగా పాలు పోస్తే.. మీరు మిలియనీర్‌ అవ్వడం పక్కా! ఒక్కసారి ట్రై చేయండి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News