Solar Eclipse 2024 date: ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?

Surya Grahan 2024 date: సూర్య, చంద్ర గ్రహాణాలను ఖగోళ సంఘటనలుగా భావిస్తారు. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ లో సంభవించబోతుంది. ఇది భారతదేశంలో కనిపిస్తుందో లేదో తెలుసుకోండి.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2024, 05:54 PM IST
Solar Eclipse 2024 date: ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?

First Solar Eclipse Of 2024: ఈ ఏడాది రెండు సూర్య, రెండు చంద్రగ్రహణాలు ఏర్పడబోతున్నాయి. సాధారణంగా సూర్యుడు మరియు భూమి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం అని పిలుస్తారు. ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ నెలలో సంభవిస్తుంది. ఆస్ట్రాలజీలో గ్రహణాలను అశుభకరంగా భావిస్తారు. ఈ సమయంలో కొన్ని పనులు చేయడం నిషేధంగా భావిస్తారు. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 8 సోమవారం నాడు సంభవించబోతుంది. ఈసారి ఏర్పడబోయేది సంపూర్ణ సూర్యగ్రహణం. ఇది భారతదేశంలో కనిపించదు. దీంతో సూతక్ కాలం కూడా చెల్లదు. 

ఈ సంవత్సరం మెుదటి సూర్యగ్రహణం గ్రహణాన్ని పశ్చిమ యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్ మరియు ఆర్కిటిక్ నుండి చూడవచ్చు. ఈ గ్రహణానికి 9 గంటల ముందు సూతక్ కాలం మెుదలవుతుంది. ఈ గ్రహణం కొన్ని రాశులవారికి అనుకూలంగా, మరికొన్ని రాశులవారికి అశుభకరంగా ఉంటుంది. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదు. వస్తే దాని ప్రభావం పుట్టబోయే పిల్లలపై పడుతుంది. అంతేకాకుండా పూజలు చేయడం నిషేదం. 

రెండో సూర్యగ్రహణం ఎప్పుడు?
ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం అక్టోబర్ 2 బుధవారం నాడు ఏర్పడబోతుంది. ఇది వార్షిక సూర్యగ్రహణం.  ఈ గ్రహణ సమయంలో సూర్యుని యొక్క మధ్య భాగం మాత్రమే చంద్రునిచే కప్పబడి ఉంటుంది మరియు సూర్యుని యొక్క బాహ్య వలయం అగ్ని వలయం వలె కనిపిస్తుంది. దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా పిలుస్తారు.

Also Read: Shani Dev: 2025 వరకు కుంభరాశిలోనే శని.. ఈ ఏడాదంతా ఈ 3 రాశులకు మనీ మనీ మోర్ మనీ..

Also Read: Zodiac Signs: ఈ రాశుల గల అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే జీవితాంతం సుఖసంతోషాలే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News