Surya Grahan 2023: త్వరలోనే రెండో సూర్యగ్రహణం.. ఈ రాశులపై ప్రతికూల ప్రభావం!

Solar Eclipse 2023: ఈ ఏడాది రెండవ లేదా చివరి సూర్యగ్రహణం త్వరలో ఏర్పడబోతుంది. ఇది ఎప్పడు సంభవించనుంది, ఇది భారతదేశంలో కనిపిస్తుందా, రాశులపై ఎలాంటి ప్రభావం చూపనుందో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 27, 2023, 01:27 PM IST
Surya Grahan 2023: త్వరలోనే రెండో సూర్యగ్రహణం.. ఈ రాశులపై ప్రతికూల ప్రభావం!

Second Surya Grahan 2023 date time in India: సూర్య, చంద్ర గ్రహణాలు ఖగోళ సంఘటనలుగా భావిస్తారు. చాలా మంది ఈ గ్రహాణాలు అశుభకరంగా భావిస్తారు. ఈ సమయంలో కొన్ని పనులు, శుభకార్యాలు చేయడం నిషేధం. ఇప్పటికే ఈ సంవత్సరం ఒక సూర్యగ్రహణం, ఒక చంద్రగ్రహణం ఏర్పడ్డాయి. మరి ఈ ఏడాది రెండవ లేదా చివరి సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడబోతుంది, ఇది రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. 

2023లో రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ 14, శనివారం సంభవించబోతుంది. ఇప్పుడు ఏర్పడబోయేది కంకణాకృతి సూర్యగ్రహణం. ఈ గ్రహణ సమయంలో సూర్యుడు రింగ్ లా కనిపిస్తాడు. దీనినే రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తారు. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. ఇది ఆఫ్రికా యొక్క పశ్చిమ భాగం, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రం మరియు ఆర్కిటిక్ ప్రాంతాల్లో కనిపించనుంది. ఈ గ్రహణం రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. ముఖ్యంగా సింహం, కర్కాటకం, కుంభం, మకరం, మీనం మరియు ధనుస్సు రాశులవారికి అనుకూలంగా ఉంటే... మరో నాలుగు రాశులవారు ప్రతికూలంగా ఉంటుంది.  

Also Read: Budh Uday 2023: మిథున రాశిలో ఉదయించిన బుధుడు.. ఈ 3 రాశులవారు ధనవంతులవ్వడం పక్కా...

ఈ రాశులపై ప్రతికూల ప్రభావం
మేషరాశి - సూర్యగ్రహణం మేషరాశి వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. మీ సన్నిహితులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో అడ్డంకులు వస్తాయి. మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోనే అవకాశం ఉంది. 
వృషభం - సూర్యగ్రహణం వల్ల వృషభ రాశి వారికి ధన నష్టం కలుగుతుంది. మీరు మీ మాటలను అదుపులో ఉంచుకోండి, లేకపోతే చిక్కుల్లో పడతారు. మీకు ఆఫీసులో సమస్యలు ఎదురవుతాయి. 
కన్యారాశి- కన్యారాశి వారికి సూర్యగ్రహణం అశుభ ఫలితాలను ఇస్తుంది. కుటుంబం మరియు స్నేహితులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది.

Also Read: Mars Transit 2023 Effects: ఈ రాశులవారికి 49 రోజుల పాటు కష్టాలు, నష్టాలు తప్పవా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News