Surya-Shani Yuti: విడిపోయిన సూర్యుడు-శనిదేవుడు.. ఈ రాశులకు మంచి రోజులు మెుదలు..

Surya And Shani Yuti: జ్యోతిషశాస్త్రం ప్రకారం, సూర్యుడు మరియు శని కలయిక కుంభరాశిలో ముగిసింది. దీని వల్ల 3 రాశుల వారికి మంచి రోజులు మొదలవుతాయి.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 18, 2023, 03:58 PM IST
Surya-Shani Yuti: విడిపోయిన సూర్యుడు-శనిదేవుడు.. ఈ రాశులకు మంచి రోజులు మెుదలు..

Surya And Shani Conjunction 2023: గ్రహాలు కాలానుగుణంగా ఇతర గ్రహాలతో పొత్తులు పెట్టుకుంటాయి. కొంత కాలం తర్వాత ఆ మైత్రి తెగిపోతుంది. రీసెంట్ గా సూర్యుడు మరియు శని గ్రహాల కలయిక ముగిసిపోయింది. శత్రు గ్రహాలైన ఈ రెండు మెున్నటి వరకు కుంభరాశిలో కలిసి ఉన్నాయి. మార్చి 16న వీరి కూటమి క్లోజ్ అయింది. దీని కారణంగా కొన్ని రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

మేష రాశిచక్రం
శని మరియు సూర్యుని మైత్రి ముగియడం వల్ల మేష రాశి వారికి మేలు చేకూరుతుంది. మీకు లాభాలు పెరుగుతాయి. మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విదేశాలకు సంబంధించిన వ్యాపారం చేసేవారు మంచి లాభాలను పొందుతారు. షేర్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలో పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
వృషభ రాశి
శని మరియు సూర్యుడి విడిపోవడం వల్ల వృషభరాశి వారికి అనుకోకుండా డబ్బు వచ్చి పడుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందుతారు. ఆర్థికంగా లాభపడతారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. జాబ్ చేసేవారికి ఇంక్రిమెంట్ తో పదోన్నతి లభిస్తుంది. వ్యాపారస్తులు పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకుంటారు. 
కుంభ రాశి
శని మరియు సూర్యుని కలయిక ముగిసిన వెంటనే కుంభ రాశి వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. దీంతో మీ ఆదాయం పెరుగుతుంది. వ్యాపారవేత్తలు మంచి ఆర్డర్‌లను పొందుతారు. ఈ సమయంలో మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. 

Also Read: Budh Guru Yuti 2023: మీనరాశిలో బుధ-గురు సంయోగం.. ఈ రాశులకు కలిసిరానున్న కాలం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News