2022 October Horoscope: దసరా, దీపావళి పండుగలకు ఈ రాశులవారి అదృష్టం ప్రకాశిస్తుంది!

Horoscope October 2022: అక్టోబర్ నెల చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే దసరా, దీపావళి వంటి ముఖ్యమైన పండుగలు ఈ నెలలో జరుపుకుంటారు. ఈ నెల కొన్ని రాశులవారి అదృష్టాన్ని మార్చనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 29, 2022, 10:35 AM IST
2022 October Horoscope: దసరా, దీపావళి పండుగలకు ఈ రాశులవారి అదృష్టం ప్రకాశిస్తుంది!

October Money Horocope 2022: అక్టోబర్ మాసం మెుదలవ్వడానికి ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ప్రధాన పండుగలైన దసరా, దీపావళి ఈ నెలలోనే వస్తున్నాయి. దీంతో ఆరు రాశులవారి అదృష్టం మారిపోనుంది. వీరు కెరీర్ లో పురోగతి, వ్యాపారంలో లాభం, అపారమైన ధనాన్ని పొందుతారు. వచ్చే నెలలో ఏ రాశులవారి అదృష్టం మారనుందో ఓ లుక్కేద్దాం. 

మేషం (Aries)- అక్టోబర్ నెల మేషరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. దీంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఆదాయం పెరుగుతుంది. డబ్బు సంపాదించడానికి అనేక కొత్త మార్గాలు ఏర్పడతాయి.  

వృషభం (Taurus)- అక్టోబర్ నెలలో వృషభ రాశి వారు ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఉద్యోగులు ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుతారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీరు పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం.

సింహం (leo)- సింహ రాశి వారికి అక్టోబర్‌లో ధనప్రాప్తి కలుగుతుంది. చాలా డబ్బు రావడం వల్ల ఒక్కసారిగా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. వ్యాపారస్తులు భారీగా లాభపడతారు. 

తులారాశి (Libra)- అక్టోబర్ నెల తులారాశి వారికి ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది. మీరు కొత్త ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుతాయి కానీ మీరు దాని గురించి చింతించకండి. ఉద్యోగులు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందే అవకాశం ఉంది. 

ధనుస్సు (Sagittarius)- ధనుస్సు రాశి వారికి అక్టోబర్‌లో ఆస్తి లాభం చేకూరుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యాపారంలో చాలా లాభాలు ఉంటాయి. మీరు మితిమీరిన ఆత్మవిశ్వాసానికి పోవద్దు. 

కుంభం (Aquarius)- అక్టోబర్ కుంభ రాశి వారికి ఆర్థికంగా లాభం చేకూరుస్తుంది. వ్యాపారంలో భారీ లాభాలను ఆర్జిస్తారు. మీరు విదేశాల నుండి డబ్బు పొందే అవకాశం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది.  

Also Read: Shani Margi 2022: ధంతేరాస్ నాడు మార్గంలోకి శనిదేవుడు...ఈ 5 రాశులవారికి డబ్బే డబ్బు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.        

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu       

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News