Shukra Gochar 2022: ఐశ్వర్యం, తేజస్సు, ఆనందాన్ని ఇచ్చేవాడు శుక్రుడు. నవంబర్ 11న శుక్రుడు వృశ్చికరాశిలో సంచరించనున్నాడు. అనంతరం రెండు రోజులకే కుజుడు వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు, కుజుడు రాశి మార్పు వల్ల అరుదైన రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశులకు శుభప్రదంగా ఉంటుంది. వృశ్చికరాశిలో శుక్ర సంచారం (Venus transit in Scorpio 2022) వల్ల ఏ రాశులవారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం.
మేషం (Aries): వృశ్చికరాశిలో శుక్రుని సంచారం మేషరాశి వ్యక్తుల జీవితాలపై శుభప్రభావం చూపుతుంది. ఇది మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది. పార్టనర్ షిప్ తో పనిచేసే వ్యాపారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం.
కర్కాటక రాశి (Cancer): వృశ్చిక రాశిలో శుక్రుడు రాకతో కర్కాటక రాశి వారికి లాభం చేకూరనుంది పెళ్లికాని యువతీ యువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. సంతానం లేని దంపతులకు పిల్లలు కలుగుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు విజయం సాధిస్తారు.
సింహ రాశి (Leo): శుక్ర సంచారం ఈ రాశివారికి కెరీర్‌లో చాలా విజయాలను ఇస్తుంది. అంతేకాకుండా సింహరాశి వారి సుఖాలు పెరుగుతాయి. మీరు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడుపుతారు. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం.
తులారాశి (Libra): శుక్రుడి రాశి మార్పు మీకు కలిసి వస్తుంది. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. పార్టనర్ షిప్ తో చేసే వ్యాపారం మీకు లాభాలను తెస్తుంది. మీ ఆదాయంలో ఆకస్మిక పెరుగుదల ఉంటుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది.
మకర రాశి (Capricorn): ఈ రాశివారికి శుక్ర సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఆర్థికంగా పురోగమిస్తారు. మీ కోరికలు నెరవేరుతాయి. ఆఫీసులో మీకు ప్రశంసలు దక్కుతాయి. మీ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
Also Read: Jupiter transit 2022: మీనరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులపై డబ్బు వర్షం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook