Bike Riding Viral Videos: ప్రేమికులకైనా, భార్యాభర్తలకైనా పబ్లిగ్గా ఒకరిపై మరొకరు డీప్ ఎఫెక్షన్ చూపించుకోవడానికి కొన్ని హద్దులు ఉంటాయి. ఆ హద్దులు అతిక్రమిస్తే వారు చట్టాలను అతిక్రమించినట్టే అనే విషయం కొంతమంది ఆకతాయి యువతీ యువకులకు తెలియదు. ఆ విషయం తెలియక ఇదిగో ఇలా పబ్లిగ్గా పిచ్చి పిచ్చి వేషాలు వేసి వార్తల్లోకెక్కి పరువు పోగొట్టుకోవడమే కాకుండా అనేక ఇబ్బందుల పాలవుతుంటారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఏముందంటే.. ఒక యువకుడు తన గాళ్ ఫ్రెండుని బైకు పెట్రోల్ ట్యాంకుపై తన వైపు తిప్పి కూర్చోబెట్టుకుని బైక్ రైడింగ్ చేస్తున్నాడు. ఆ సమయలో ఆ అమ్మాయి అతడినే బలంగా హత్తుకుని ఉంది. అలా పబ్లిగ్గా ఒకరినొకరు కౌగిలించుకోవడమే సరికాదంటే.. ఏకంగా బైకుపై కౌగిలించుకుని విన్యాసాలు చేస్తుండటం చూసి అదే రోడ్డుపై వెళ్లే వారు, ఇంటర్నెట్లో ఈ వీడియో చూసిన వారు మండిపడుతున్నారు.
ఢిల్లీలోని మంగోల్ పురి ఏరియా సమీపంలో ఔటర్ రింగు రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, అదే బైకు వెనకాలె వెళ్తున్న మరో వ్యక్తి ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాన్ని తన మొబైల్ కెమెరాలో బంధించాడు. ఆ దృశ్యాన్ని అర్బన్ ఉత్సవ్ అనే ట్విటర్ యూజర్ ట్విటర్ వేదికగా సోషల్ మీడియాలో పంచుకోగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.
Idiot's of Delhi
Time - 7:15pm
Day - Sunday 16-July
Outer Ring Road flyover, Near Mangolpuri@dtptraffic pic.twitter.com/d0t6GKuZS5— 𝖀𝖗𝖇𝖆𝖓 𝖀𝖙𝖘𝖆𝖛 🗨️🦂 (@Buntea) July 16, 2023
ఈ వీడియో ట్వీట్లో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులను కూడా ట్యాగ్ చేయడంతో వారు స్పందించారు. ఇలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలపై స్పందించినందుకు సదరు ట్విటర్ యూజర్‌కి కృతజ్ఞతలు చెప్పిన ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు.. ఇలాంటి ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారాన్ని తమకు తమ అధికారిక యాప్ అయిన ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు సెంటినెల్ యాప్‌కి ఫిర్యాదు చేయాల్సిందిగా కోరారు. అలాగే ప్రియురాలితో పబ్లిగ్గా సిగ్గు లేకుండా ఈ బైక్ నడుపుతూ బైక్ స్టంట్స్ చేసిన యువకుడికి ట్రాఫిక్ చలానా పంపించేందుకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు రెడీ అవుతున్నారు.