Diamond Necklace Found Garbage: తన కుమార్తె పెళ్లి కోసం తయారుచేయించిన నెక్లెస్ పొరపాటున చెత్తడబ్బాలో పడేశారు. కొద్దిసేపటి తర్వాత పొరపాటు గ్రహించిన అతడు వెంటనే మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అతడి ఫిర్యాదుకు వెంటనే స్పందించి మున్సిపల్ అధికారులు నెక్లెస్ కోసం విస్తృతంగా గాలించారు. కొన్ని గంటల తర్వాత నెక్లెస్ చెత్తలో నుంచి లభించింది. నెక్లెస్ లభించడంతో ఆ తండ్రి ఆనందానికి అవధులు లేవు. ఈ సంఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది.
Also Read: Security Denied Dhoti Farmer: లుంగీ కట్టారని అనుమతించని సెక్యూరిటీ.. మాల్ ఎదుట రైతుల ధర్నా
చెన్నై నగరంలో దేవరాజ్ అనే వ్యక్తి కుటుంబంతో నివసిస్తున్నారు. తన కుమార్తె వివాహం కోసం అతడి తల్లి రూ.5 లక్షల వజ్రాల హారం తయారుచేయించింది. అది దేవరాజ్‌కు ఇచ్చారు. అయితే ఆదివారం ఇంట్లో ఉన్న చెత్తను దేవరాజ్ వచ్చిన మున్సిపల్ సిబ్బంది వాహనంలో వేశారు. ఆ సమయంలో పొరపాటున చేతిలో ఉన్న వజ్రాల హారాన్ని కూడా చెత్తతో పాటు వేశారు. అనంతరం కొన్ని నిమిషాల తర్వాత నెక్లెస్ విషయాన్ని దేవరాజ్ గ్రహించారు. చెత్తతోపాటు నెక్లెస్‌ను అందులో వేసినట్లు గుర్తు చేసుకుని వెంటనే స్పందించారు. మున్సిపల్ సిబ్బందికి జరిగిన విషయాన్ని వివరించారు.
Also Read: Floods Marriage: ఫంక్షన్లంటే మాకు పిచ్చి.. ఎట్లున్నా వెళ్లి తీరుతాం
చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఆంథోనిసామి స్పందించారు. వెంటనే ఆ ప్రాంతంలో చెత్తను తీసుకెళ్లిన సిబ్బంది వివరాలను ఆరా తీశారు. ఆ తర్వాత చెత్త బండిని తీసుకెళ్లిన కార్మికులను గుర్తించారు. వారి వద్దకు చేరుకుని చెత్త రిక్షాలో మొత్తం వ్యర్థ పదార్థాలను తీసి వెతికారు. ఆ సమయంలో నెక్లెస్ జాడ లభించింది. పూలమాలలో ఆ నెక్లెస్ చిక్కుకుని ఉంది. అది చూసిన దేవరాజ్ నెక్లెస్ అదేనని గుర్తించారు. నెక్లెస్ లభించడంతో దేవరాజ్‌తోపాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో స్పందించి విలువైన వజ్రాల హారాన్ని వెతికి ఇచ్చిన అధికారులు, సిబ్బందికి దేవరాజ్ కృతజ్ఞతలు తెలిపారు.
₹5,00,000 worth diamond necklace was recovered from garbage by the conservancy team of Dn137, Zn10.#GCC appreciates @SumeetUrbaser team that helped Mr Devaraj residing in an apartment in RajamannarSalai who accidentally disposed of the necklace that was recovered from the bin. pic.twitter.com/OMR1n2Gujt
— Greater Chennai Corporation (@chennaicorp) July 21, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి