Woman Lost Herself In Ludo: లూడో ఆటలో ఓడిపోయి ఇంటి ఓనర్‌తో వెళ్లిపోయిన వివాహిత

Woman Bets Herself In Ludo Game: భర్త కష్టపడి పంపించిన డబ్బును భార్య ఇలా లూడో గేమ్ ఆడి ఇంటి ఓనర్ పాలుచేసింది. చివరకు తనను తానే పందెంలో పెట్టుకుని, ఆట ఓడిపోయి ఇంటి ఓనర్‌తోనే ఉండిపోయింది. అయితే, ఈ విషయం తానే భర్తకు ఫోన్ చేసి చెప్పుకోవడంతో భార్య చేసిన పనికి షాకవడం అతడి వంతయ్యింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 7, 2022, 08:31 AM IST
  • లూడో గేమ్ ఆడి సర్వం పోగొట్టుకున్న వివాహిత
  • ఆఖరికి తనని తానే పందంలో పెట్టుకున్న మహిళ
  • ఆటలో ఓడిపోవడంతో భర్తను వదిలేసి ఇంటి ఓనర్‌తో ఉంటున్న మహిళ
Woman Lost Herself In Ludo: లూడో ఆటలో ఓడిపోయి ఇంటి ఓనర్‌తో వెళ్లిపోయిన వివాహిత

Woman Bets Herself In Ludo Game: ఉత్తరప్రదేశ్: చాలామంది లూడో గేమ్‌కి బానిసై లక్షల కొద్ది డబ్బులు పోగొట్టుకున్నారనే వార్తలే ఇప్పటి వరకు విన్నాం. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే వార్త అంతకు మించి. కాదు కాదు.. అన్నింటింకి మించి. లూడో గేమ్‌కి బానిసైన ఓ వివాహిత.. ఇంటి ఓనర్‌తో ఆడిన ఆటలో తన దగ్గర ఉన్న డబ్బు అంతా కోల్పోయింది. అయినప్పటికీ ఆటపై ఆశ చావలేదు. గెలుస్తానన్న నమ్మకం పోలేదు. ఆ పిచ్చి నమ్మకంతోనే ఈసారి తనని తానే బెట్టింగులో తాకట్టుగా పెట్టుకుంది. ఎప్పటిలాగే మళ్లీ ఓడిపోయింది. ఓడిపోయిన సదరు మహిళ తన తప్పు తాను తెలుసుకుని అంతటితో ఆగిపోయినా బాగుండేది. కానీ ఇచ్చిన మాట ప్రకారం తన భర్తను వదిలేసి ఇంటి ఓనర్‌తోనే కలిసి జీవించడం మొదలుపెట్టింది. 

యావత్ ప్రపంచం నివ్వెరపోయే ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని దేవ్‌రియా జిల్లా భగల్‌పూర్ తాలూకా దేవ్‌కలి ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆ మహిళ పేరు రేణు. ఆమె భర్త పొరుగు రాష్ట్రమైన రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో పని చేసుకుంటూ వచ్చిన డబ్బును కుటుంబపోషణ కోసం ఇంటికి పంపిస్తున్నాడు. భర్త కష్టపడి పంపించిన డబ్బును భార్య ఇలా లూడో గేమ్ ఆడి ఇంటి ఓనర్ పాలుచేసింది. చివరకు తనను తానే పందెంలో పెట్టుకుని, ఆట ఓడిపోయి ఇంటి ఓనర్‌తోనే ఉండిపోయింది.

అయితే, ఈ విషయం తానే భర్తకు ఫోన్ చేసి చెప్పుకోవడంతో భార్య చేసిన పనికి షాకవడం అతడి వంతయ్యింది. వెంటనే పరుగో పరుగున సొంతూరికి వచ్చిన ఆ అమాయకపు భర్త.. ఇంటి ఓనర్ చేసిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా లూడో గేమ్‌కి బానిసై మీ జీవితాలను చిన్నాబిన్నం చేసుకోకండి అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వినడానికి విచిత్రంగానే ఉన్నప్పటికీ.. ఇది ఉత్తర్ ప్రదేశ్‌లో చోటుచేసుకున్న వాస్తవ ఘటన. ఏ మాత్రం కష్టపడకుండానే గ్యాంబ్లింగ్‌తో వచ్చే సొమ్ముపై కొంతమంది ఎంత ఆశ ఉంటుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది. 

ఈ ఘటన గురించి విన్న వాళ్లంతా ముక్కున వేలేసుకుంటున్నారు. తాగిన మైకంలో భార్యను తాకట్టుపెట్టిన భర్తలను చూశాం కానీ.. భర్తే బుద్దిగా పని చేసుకుంటుంటే.. నిన్ను నువ్వు తాకట్టుపెట్టుకుని ఓనర్‌తో కలిసి ఉండటం ఏంటని నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇంకొంతమంది ఆమె ప్రవర్తనపైనే అనుమానం వ్యక్తంచేస్తున్నారు. గుణవంతురాలు ఎవ్వరూ ఈ పని చేయరు. ఆమె గుణవంతురాలు కాదు కాబట్టే ఇలా చేసిందని కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : King Cobra Monkey Viral Video: బ్లాక్ కింగ్ కోబ్రా తోకను లాగిన కోతి.. చివరికి ఏమైందంటే?

ఇది కూడా చదవండి : Dangerous Python Video: ఆ వృద్ధుడి మెడను చుట్టేసి మింగేందుకు ప్రయత్నించిన కొండచిలువ, తరువాత ఏమైంది

ఇది కూడా చదవండి : Honest Thief: నేను దొంగనే.. కానీ మంచి దొంగను.. వైరల్ వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News