Woman Beats Man With Slipper: స్టేజీ మీదే అందరి ముందు చెప్పుతో చెంప ఛెళ్లుమనిపించిన మహిళ

Woman Beats Man With Slipper: మహిళ చేతిలో చెప్పు దెబ్బలు తిన్న వ్యక్తి ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆ మహిళ ఊరుకోలేదు. తగ్గేదెలే అన్నట్టు అపరకాళీ అవతారమెత్తిన మహిళ అతడిని చెప్పుతోనే చితక్కొట్టింది. ఢిల్లీలోని ఛత్తర్‌పూర్‌లో హిందూ ఏక్తా మంచ్ అనే సంస్థ నిర్వహించిన భేటీ బచావో మహాపంచాయత్ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Written by - Pavan | Last Updated : Nov 29, 2022, 06:24 PM IST
  • స్త్రీకి కోపం వస్తే ఇలా ఉంటుందా అనేలా ఇరగదీసిన మహిళ
  • వేదికపైనే అతడిని చీరి చింతకు కట్టిన మహిళ
  • చెప్పుతో దేహశుద్ధి చేసినా చల్లారని ఆగ్రహం
Woman Beats Man With Slipper: స్టేజీ మీదే అందరి ముందు చెప్పుతో చెంప ఛెళ్లుమనిపించిన మహిళ

Woman Beats Man With Slipper: హిందూ ఏక్తా మంచ్ నిర్వహిస్తోన్న భేటీ బచావో మహాపంచాయత్ కార్యక్రమం జరుగుతుండగా స్టేజీపై మైక్ ముందు నిలబడి మాట్లాడుతున్న ఓ మహిళ ఉన్నట్టుండి తన చెప్పు తీసుకుని తన పక్కనే తనను ఆనుకుని ఉన్న వ్యక్తిని చెంపలు వాయగొట్టడం మొదలుపెట్టింది. ఈ ఊహించని పరిణామం అతడినే కాదు.. అక్కడున్న వాళ్లందరినీ షాక్ కి గురయ్యేలా చేసింది. ఆ మహిళ ఎందుకు అతడిని అంత తీవ్రంగా కొట్టిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. 

మహిళ చేతిలో చెప్పు దెబ్బలు తిన్న వ్యక్తి ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆ మహిళ ఊరుకోలేదు. తగ్గేదెలే అన్నట్టు అపరకాళీ అవతారమెత్తిన మహిళ అతడిని చెప్పుతోనే చితక్కొట్టింది. ఢిల్లీలోని ఛత్తర్‌పూర్‌లో హిందూ ఏక్తా మంచ్ అనే సంస్థ మంగళవారం భేటీ బచావో మహాపంచాయత్ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కార్యక్రమంలో మహిళా సాధికారత గురించి, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తన అభిప్రాయాలను పంచుకుంటుండగా.. సదరు మహిళ పక్కనే వచ్చి నిలుచున్న ఓ వ్యక్తి ఆమెను తాకుతూ నిలుచోవడమే ఆమె ఆగ్రహానికి కారణమైందని తెలుస్తోంది. 

ఓవైపు మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మాట్లాడుతుండగానే..మరోవైపు అదే వేదికపై తనను ఇబ్బందిపెట్టేలా ప్రవర్తించడం ఏంటనే ఆగ్రహంతోనే ఆ మహిళ అతడిని ఇలా చెప్పు తీసి దేహశుద్ధి చేసి బుద్ధి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులను మరిన్ని వివరాలు కోరగా.. తమకు ఇంకా ఎవ్వరి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్పష్టంచేశారు. 

ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ మహిళ ప్రసంగిస్తున్న సమయంలోనే ఆమెను మైక్ నుంచి దూరం నెట్టేసేందుకు ప్రయత్నించాడని.. అందుకే ఆమె ఆగ్రహంతో అతడిని చెప్పుతో కొట్టిందని ఏఎన్ఐ పేర్కొంది. అన్నట్టు అఫ్తాబ్ అమిన్ పూనావాలా చేతిలో శ్రద్ధా వాకర్ దారుణ హత్యకు గురైంది కూడా ఇదే ఛత్తర్‌పూర్‌లో అనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సమాజంలో పురుషుల ఆధిపత్య ధోరణిని, స్త్రీలపై పెరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరాలపైనే భేటీ బచావో మహాపంచాయత్ కార్యక్రమం నిర్వహించినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Trending News