Boycott Bharat Matrimony.Com : బాయ్‌కాట్ భారత్ మ్యాట్రిమోనీ.కామ్ ... ప్రస్తుతం ట్విటర్లో ట్రెండ్ అవుతున్న టాపిక్ ఇది. ఉన్నట్టుండి నెటిజెన్స్‌కి భారత్ మ్యాట్రిమోనీ.కామ్‌పై అంత కోపం ఎందుకు వచ్చింది అంటే ఈ ట్రెండింగ్ టాపిక్ వెనుకున్న అసలు సంగతి తెలుసుకోవాలి. ఉమెన్స్‌డే ప్లస్ హోలీ పండగ సందర్భంగా భారత్‌మ్యాట్రిమోనీ.కామ్ ఒక వీడియోను తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పోస్ట్ చేసింది. ఒక సామాజిక సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో భారత్ మ్యాట్రిమోనీ.కామ్ పోస్ట్ చేసిన వీడియోనే ఆ వెబ్‌సైట్‌పై నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేసేందుకు కారణమైంది.
ఆ వీడియో చూసిన నెటిజెన్స్, హిందూ ఫాలోవర్స్ భారత్ మ్యాట్రిమోనీ.కామ్‌పై మండిపడుతూ.. #BoycottBharatMatrimony అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్రోల్ చేస్తున్నారు. దీంతో బాయ్‌కాట్ భారత్ మ్యాట్రిమోనీ.కామ్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ నెటిజెన్స్‌కి , హిందూ సంఘాల ఫాలోవర్స్‌కి కోపం తెప్పించేలా ఆ వీడియోలో ఏం ఉందో చూడండి.
This Women's Day & Holi, let's celebrate by creating safer and more inclusive spaces for women. It's important to acknowledge the challenges that women face in public spaces and create a society that truly respects their well-being - today & forever.#BharatMatrimony #BeChoosy pic.twitter.com/9bqIXZqaXu
— Bharatmatrimony.com (@bharatmatrimony) March 8, 2023
ఈ వీడియోను పరిశీలించినట్టయితే.. హోలీ పండగలో పాల్గొన్న ఒక యువతి ఫేస్ వాష్ చేసుకోవడం.. ముఖంపై రంగులు చెదిరిపోగానే ఆమెపై జరిగిన దాడికి సంబంధించిన గాయాల ఆనవాళ్లు స్పష్టంగా కనపడటం చూడొచ్చు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. హోలీ పండగ వేళ మహిళలు కూడా సేఫ్ హోలీ జరుపుకునే విధంగా వారు కూడా హోలీ వేడుకల్లో భాగస్వాములు అయ్యేలా చూడాలని కోరుతూ భారత్ మ్యాట్రిమోనీ.కామ్ టెక్ట్స్ రూపంలో సందేశం ఇచ్చింది.
బాయ్‌కాట్ భారత్ మ్యాట్రిమోనీ.కామ్ ఎందుకు ట్రెండ్ అయ్యిందంటే..
ఈ వీడియో చూసిన నెటిజెన్స్, హిందూ సంఘాల ఫాలోవర్స్ భారత్ మ్యాట్రిమోనీ.కామ్ పై ఒంటికాలితో లేస్తున్నారు. ఒక హిందువుల పండగపై బురదజల్లే ప్రయత్నం జరుగుతోందని ట్విటర్ వేదికగా దాడి మొదలుపెట్టారు. హిందువులనే భారీ సంఖ్యలో కస్టమర్స్ గా కలిగి ఉన్న భారత్ మ్యాట్రిమోనీ.కామ్ కి ఎంత ధైర్యం ఉంటే ఈ విధంగా వ్యవహరిస్తుంది అంటూ మండిపడుతున్నారు.
Since @bharatmatrimony has doubled down, it's time Hindus show them their market power.
Will make sure every Hindu around me is aware of their Hinduphobia. Let's promote @ShaadiDotCom instead. https://t.co/eA2coAfHVJ
— Dharmocracy (@Dharmocratic) March 9, 2023
Such brands and their marketing & promotions teams should be slapped with criminal charges on demeaning Hindu festivals and Hindu culture. https://t.co/Gv3lNaKzLM
— Trunicle (@trunicle) March 9, 2023
Assaulting the oldest religion in the wolrd for a culture of abuse and violence against women brought by invading abrahamic faiths is criminal. The biggest abuse of women in Bharatiya history is by Islamic invaders and colonial settlers. Not Holi. https://t.co/e4vDk5Hac1
— Rashmi Samant (@RashmiDVS) March 9, 2023
" భారత్ మ్యాట్రీమోనీ.కామ్ తన వైఖరి మార్చుకుని ఆ వీడియో తొలగించకపోతే.. ఇకపై భారత్ మ్యాట్రీమోనీ.కామ్ వెబ్సైట్ ద్వారా సంబంధాలు అందుకోవద్దని చెబుతూ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కూడా రన్ చేయాల్సి ఉంటుంది " అని మరొక యూజర్ హెచ్చరించారు.
ఇదిలావుంటే, భారత్ మ్యాట్రిమోనీ.కామ్ కి బిజినెస్ ఎక్కువైందని.. హిందువుల పవర్ ఏంటో తెలిసేలా షాదీ.కామ్ ని ప్రోత్సహించి భారత్ మ్యాట్రీమోనీ.కామ్ ని పక్కనపెట్టేద్దాం అని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. భారత్ మ్యాట్రిమోనీ.కామ్ కి సంబంధించిన అన్ని సామాజిక మాధ్యమాల్లోంచి ఆ వీడియోను తొలగించి హిందువులకు బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే.. హిందువుల పండగలుపై బురదచల్లే ప్రయత్నం చేస్తే తమ పవర్ ఏంటో చూపిస్తాం అని మరొకరు వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి : Health Benefits of Bhang: భాంగ్ అంటే ఏంటి ? ఎలా తయారు చేస్తారు ? ఇది తాగితే ఏమవుతుంది ?
ఇది కూడా చదవండి : Angry Wife: నా భార్య కోపంగా ఉంది.. 10 రోజులు సెలవు కావాలి.. పోలీస్ ఆఫీసర్ లీవ్ లెటర్ వైరల్
ఇది కూడా చదవండి : Holi 2023 Skincare Tips: హోలీ పండగ వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Faceboo