Snake Catcher Rescue King Cobra: 7 రోజులుగా ఉచ్చులోనే కింగ్ కోబ్రా.. దాహంతో అల్లాడుతున్న పాముకి నీరు తాగించిన స్నేక్ క్యాచర్!

White King Cobra Drinks Water: కింగ్ కోబ్రా నీరు త్రాగే వీడియో ఒకటి  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో ఏంటో మీరే చూసేయండి!

Written by - P Sampath Kumar | Last Updated : Mar 12, 2023, 05:50 PM IST
  • కింగ్ కోబ్రా నీరు త్రాగుతుందా..? లేదా..?
  • ఈ వీడియో చూస్తే అసలు నిజం తెలిసిపోతుంది
  • 7 రోజులుగా ఉచ్చులోనే కింగ్ కోబ్రా..
Snake Catcher Rescue King Cobra: 7 రోజులుగా ఉచ్చులోనే కింగ్ కోబ్రా.. దాహంతో అల్లాడుతున్న పాముకి నీరు తాగించిన స్నేక్ క్యాచర్!

White King Cobra Drinking Water Video got Viral: పాములు నీటిని త్రాగుతాయా..? లేదా..? అన్న అనుమానం చాలా మందిలో ఉంటుంది. కొన్ని ప్రత్యేక పండగల సందర్భాల్లో నాగు పాములు పాలు తాగయని మనం వార్తలు చదువుతాం. అయితే వీడియోస్ మాత్రం చాలా అరుదుగా చూస్తుంటాం. ప్రమాదకరమైన కింగ్ కోబ్రా కూడా నీటిని త్రాగుతుంది. ఇందుకు ప్రూఫ్ కూడా ఉంది. కింగ్ కోబ్రా నీరు త్రాగే వీడియో ఒకటి  సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వరుసగా వారం రోజులు పాటు చేపల వలలో చిక్కుకున్న ఆ కింగ్ కోబ్రా నీటిని గడగడా తాగేసింది. 

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం... ఒడిశాలోని పరిసర ప్రాంతంలో చెరువు నుంచి చాపలు బయటికి పోకుండా కాలువలో వల నాటారు. ఈ వలలో భారీ కింగ్ కోబ్రా చిక్కుకుపోయింది. ఇది చూసిన జనాలు కింగ్ కోబ్రాను బయటికి తీసేందుకు బయపడి.. అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారుల నుంచి ఎలాంటి సహాయం అందలేదు. వారం తర్వాత స్నేక్ క్యాచర్ మీర్జా ఎండీ ఆరిఫ్ విషయం తెల్సుకుని అక్కడికి వచ్చాడు. కింగ్ కోబ్రాను చూసిన స్నేక్ క్యాచర్ చలించిపోయాడు. ఆకలి, దాహంతో ఉన్న పాము పరిస్థితి విషమించింది.

స్నేక్ క్యాచర్ మీర్జా ఎండీ ఆరిఫ్ వలను కాస్త చించి కింగ్ కోబ్రాకు బాటిల్ సహాయంతో నీరు తాగిపించాడు. 7 రోజులుగా ఉచ్చులోనే ఉండడంతో కింగ్ కోబ్రా గడగడా నీటిని తాగేసింది. అనంతరం పాముకు చిక్కుకున్న వలను పూర్తిగా తీసి.. దాన్ని వదిలేశాడు. ఆకలితో అలమటించిన ఆ పాము నిస్సయక స్థితిలో వేగంగా కదలలేకపోయింది. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో చూసిన అందరూ కింగ్ కోబ్రా పరిస్థితి చూసి చలించిపోతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News