Whatsapp Tips and Tricks 2022: వాట్సాప్‌లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేస్తే మీకు మీరే దాన్ని అన్‌బ్లాక్ చేసుకోవడమెలాగో తెలుసా... తెలియకపోతే ఈ ట్రిక్ ఫాలో అవండి. ఈ ట్రిక్ ద్వారా ఎదుటి వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేసినా సరే.. అన్‌బ్లాక్ చేయవచ్చు. ఆపై ఎప్పటిలాగే వారికి మెసేజ్‌లు పంపవచ్చు. ఈ ట్రిక్ ఎలా పనిచేస్తుందో ఇక్కడ తెలుసుకోండి.
బ్లాక్ చేయబడిందో లేదో ఇలా చెక్ చేయండి :
ముందుగా ఎదుటి వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇందుకోసం మొదట వాట్సాప్ నుంచి వారికి మెసేజ్ చేయాలి. మీరు పంపించిన మెసేజ్‌కి డబుల్ టిక్స్ పడకపోతే.. ఎదుటి వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేశాడని అర్థం. మిమ్మల్ని బ్లాక్ చేశారని నిర్దారించుకున్న తర్వాత అన్‌బ్లాక్ కోసం కింది పద్దతిని అనుసరించండి.
వాట్సాప్‌లో మిమ్మల్ని మీరు అన్‌బ్లాక్ చేసుకోండిలా :
1. ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ ఆప్షన్ లోకి వెళ్లి అకౌంట్‌పై క్లిక్ చేయండి.
2. ఆ తర్వాత స్క్రీన్‌పై కనిపించే ఆప్షన్లలో 'డిలీట్ మై అకౌంట్'పై క్లిక్ చేయాలి.
3. ఆపై కంట్రీ కోడ్‌తో పాటు మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
4. 'డిలీట్ మై అకౌంట్' ఖాతాపై క్లిక్ చేసి.. ఎందుకు డిలీట్ చేయాలనుకుంటున్నారో కారణం తెలపాలి.
5. ఆ తర్వాత మళ్లీ వాట్సాప్ ఓపెన్ చేసి కొత్తగా మళ్లీ వాట్సాప్ అకౌంట్‌ను క్రియేట్ చేసుకోండి.
6. ఇప్పుడు ఆటోమేటిగ్గా మిమ్మల్ని మీరు అన్‌బ్లాక్ చేసుకోగలుగుతారు. మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తికి మెసేజ్‌లు పంపించగలరు.
ఈ ట్రిక్ కూడా వర్కౌట్ అవుతుంది :
మీ స్నేహితుడిని వాట్సాప్ కొత్త గ్రూప్ క్రియేట్ చేయమని అడగండి. అందులో మిమ్మల్ని, మిమ్మల్ని బ్లాక్ చేయబడిన వ్యక్తిని యాడ్ చేయమని చెప్పండి. ఇప్పుడు ఆ గ్రూపులో మీరు మెసేజ్ పోస్ట్ చేస్తే.. అది మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తికి కూడా కనిపిస్తుంది.
Also Read: Sekhar Kammula Leader 2: 'లీడర్' మూవీ సీక్వెల్లో రానాకు బదులు ఆ స్టార్ హీరో...?
Also Read : Weight Loss Yoga: ఈ యోగాసనంతో అధిక బరువు, జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.