Mystery Tree: సైన్స్‌కి కూడా అంతుచిక్కని రహస్యం..చెట్టు నుంచి ఉబికి వస్తున్న నీరు

Mystery Tree: మనం సాధారంగా ఎర్రటి పువ్వులు ఉన్న చెట్లను చూసి ఉంటాం. అయితే నీరు వచ్చే  చెట్టు ఎప్పుడైనా చూశారా? దక్షిణ ఐరోపాలోని 150 ఏళ్ల చెట్టు నుంచి నీరు ప్రవహిస్తున్నట్లు చూపించే ఒక ప్రత్యేకమైన సహజ దృగ్విషయం నెటిజన్లను నమ్మలేని విధంగా చేసింది. చెట్టు కాండం నుంచి ఆకులు లేకుండా ఒక ప్రవాహంలా నీరు ప్రవహిస్తున్నట్లు చూపిస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 6, 2022, 03:54 PM IST
  • చెట్టు కాండం నుంచి ఉబికి వస్తున్న నీరు
  • విచిత్రమైన వీడియోతో నెటిజన్లను ఆశ్చర్యపరిచిన ప్రకృతి
  • మాంటెనెగ్రో రాజధాని పోడ్‌గోరికాలోని డైనోసాలో ఉన్న చెట్టు
Mystery Tree: సైన్స్‌కి కూడా అంతుచిక్కని రహస్యం..చెట్టు నుంచి ఉబికి వస్తున్న నీరు

Mystery Tree: మనం సాధారంగా ఎర్రటి పువ్వులు ఉన్న చెట్లను చూసి ఉంటాం. అయితే నీరు వచ్చే  చెట్టు ఎప్పుడైనా చూశారా? దక్షిణ ఐరోపాలోని 150 ఏళ్ల చెట్టు నుంచి నీరు ప్రవహిస్తున్నట్లు చూపించే ఒక ప్రత్యేకమైన సహజ దృగ్విషయం నెటిజన్లను నమ్మలేని విధంగా చేసింది. చెట్టు కాండం నుంచి ఆకులు లేకుండా ఒక ప్రవాహంలా నీరు ప్రవహిస్తున్నట్లు చూపిస్తుంది. భూమి మీద చెట్లు, పక్షలు లేని ప్రపంచాన్ని మనం ఊహించుకోలేం. మానవ జాతి మనుగడ ముందుకు సాగాలంటే చెట్లు, మొక్కలు ఉండాలి. ప్రతీ విషయంలో మనుషులు చెట్లపై ఆధారపడి జీవిస్తున్నారు. దిన చర్యలో భాగంగా కూరగాయలు, ఇంటికి అవసరమైన ఫర్నిచర్‌తో సహా ప్రతి అంశంలో చెట్లపై ఆధారపడుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా మానవులు, జంతువులు మనుగడ సాగించడానికి అవసరమయ్యే ఆక్సీజన్‌ కూడా మనకు చెట్ల నుంచే వస్తుంది. చెట్లు వదులుతున్న ఆక్సిజన్‌ను మనం పిల్చుకుని మనం జీవనం సాగిస్తున్నాం. 

అయితే  చెట్ల గురించి మేం ఎందుకు ఇంత చెప్తున్నామని మీకు అర్థం కావడం లేదు కాదా..అయితే ఇప్పుడు మేం చెప్పబోయే గురించి మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మేం చెప్పబోయే చెట్టు ప్రపంచంలోనే చాలా స్పెషల్‌. ఈ చెట్టు ఆక్సిజన్‌తో పాటు స్వచ్చమైన నీటిని అందిస్తోంది. అవును మీరు విన్నది నిజమే..మేం చెప్పేది కూడా పచ్చి నిజం. నీల్లు వచ్చే చెట్టుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చెట్టు నుంచి స్వచ్చమైన నీరు రావడం వీడియోలో చూడవచ్చు. ఈ అరుదైన వృక్షం పేరు టర్మినలియా టొమెంటోసా అని చెప్తున్నారు. ఈ చెట్టును నరికితే నిరంతరంగా నీరు వస్తుంది. 30 మీటర్ల హైట్‌ ఉన్న ఈ వృక్షం పొడి..తేమతో కూడిన అడవుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. టర్మినలియా టొమెంటోసా పేరు గల ఈ చెట్టు కాండం నీటితో నిండి ఉంటుంది. ఈ చెట్టు అగ్నిప్రమాదం, ఎండల తీవ్రత నుంచి కాపాడుకుంటుంది. ఈ చెట్టును బౌద్దులు బోధి వృక్షం అని పిలుస్తూంటారు.

ఇది మాంటెనెగ్రో రాజధానిలో కనిపించింది
మీరు ఇప్పుడు చూసిన దృశ్యాలు మాంటెనెగ్రో రాజధాని పోడ్‌గోరికాలోని డైనోసా అనే గ్రామంలో ఉంది. ఈ మర్మమైన ప్రక్రియ వెనుక నిజంగా ఏమి ఉంది, దీని వెనుక శాస్త్రీయ కారణం ఏమిటో తెలుసుకుందాం. సోషల్ మీడియాలో విచిత్రమైన వీడియోతో ప్రకృతి మరోసారి ప్రజలను ఆశ్చర్యపరిచింది. మోంటెనెగ్రో, ఆగ్నేయ ఐరోపాలో, ఒక మల్బరీ చెట్టు దాని ట్రంక్ లోపల కుళాయి ఉన్నట్లుగా నీరు ప్రవహిస్తుంది. 

చెట్టు నుంచి నీరు రావడానికి కారణం ఏమిటి?
పోడ్గోరికా గ్రామంలో అనేక నీటి ప్రవాహాలు ఉన్నాయి. ఈ ప్రవాహాలు ఒక స్ప్రింగ్ ద్వారా ప్రవాహమవుతూ ఉంటాయి. వసంత ఋతువులో, మంచు కరిగిపోయినప్పుడు లేదా చాలా చోట్ల భారీ వర్షపాతం ఉన్నప్పుడు, పొంగిపొర్లుతుంది. వసంతంలో కొంత భాగం కూడా ఈ మల్బరీ చెట్ల క్రింద ప్రవహిస్తుంది. ఫలితంగా, ఓవర్‌ఫ్లో సంభవించినప్పుడు, చెట్టు దిగువ నుంచి నీరు చెట్టు యొక్క బోలులోకి పెరుగుతుంది. ఒత్తిడి కారణంగా చెట్టులో నుంచి నీరు వస్తుందని చెప్తున్నారు.

Also Read: Jodhpur Communal Violence: జోద్‌పూర్‌లో రేపు రాత్రి వరకు కర్ఫ్యూ పొడింపు

Also Read: BOI బ్యాంక్‌లో బంపర్‌ రిక్రూట్‌మెంట్‌..స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News