Cake prank Viral Video : భారీ కేక్‌ను నేలపాలు చేశారని షాక్ అయిన వధూవరులు, ట్విస్ట్‌ ఇచ్చిన హెటల్ సిబ్బంది

Bride, Groom pranked with fake wedding cake : అతిథులతో పాటు పెళ్లికొడుకు, పెళ్లి కూతురు కేక్ కోసమే వెయిటింగ్ చేస్తూ నిలబడ్డారు. హోటల్ సిబ్బంది మొత్తానికి కేక్ రెడీ చేసి తీసుకొస్తుండగా జారి కింద పడింది. పెళ్లికొడుకు, పెళ్లి కూతురితో పాటు అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఏంట్రా బాబు.. అంత పెద్ద కేక్ ఆర్డర్ ఇస్తే ఇలా చేశారని ఆశ్చర్యపోయారు. పాపం వధూవరులు కిందపడ్డ కేక్ వంక దీనంగా చూస్తూ ఉండిపోయారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 9, 2021, 06:34 PM IST
  • కేక్ కోసం వెయిట్ చేసిన పెళ్లికొడుకు, పెళ్లి కూతురికి షాక్
  • రెండు చేతుల్లో పట్టుకుని తీసుకొని వస్తుండగా జారీ పడ్డ భారీ కేక్
  • కిందపడ్డ కేక్ వంక దీనంగా చూసిన వధూవరులు
  • ట్విస్ట్ ఇచ్చిన హోటల్ సిబ్బంది
 Cake prank Viral Video : భారీ కేక్‌ను నేలపాలు చేశారని షాక్ అయిన వధూవరులు, ట్విస్ట్‌ ఇచ్చిన హెటల్ సిబ్బంది

Watch Viral Video Hotel staff prank Newlyweds Shocked As Wedding Cake Crashes Down: ఆ నవ వధూవరుల వివాహం మస్తు గ్రాండ్‌గా జరినట్లుంది. కొత్తగా పెళ్లి అయిన ఆ జంట కేక్ కట్ చేద్దామని హోటల్‌లో వెయిట్ చేస్తూ ఉంది. అతిథులంతా అక్కడే ఉన్నారు. వీరు కేక్ కట్ చేస్తే అందరూ కాస్త తిని.. విషెస్ చెప్పి వెళ్దామని వెయిట్ చేస్తున్నట్లు ఉన్నారు వారంతా. 

అతిథులతో పాటు పెళ్లికొడుకు, పెళ్లి కూతురు కేకు కోసమే వెయిటింగ్ చేస్తూ నిలబడ్డారు. కేక్ కూడా చాలా పెద్దదే ఆర్డర్ ఇచ్చారు. ఇంతలో కొందరు హోటల్ సిబ్బంది మొత్తానికి కేక్ రెడీ చేసి తీసుకురావడం మొదలుపెట్టారు. ఒక వ్యక్తి టేబుల్‌ను తీసుకుని వస్తుండగా.. మరో ఇద్దరు పెద్ద కేక్ రెండు చేతుల్లో పట్టకుని తీసుకొని వస్తున్నారు. 

అంతలోనే ఆ పెద్ద కేక్ (Big cake) ఒక్కసారిగా హోటల్ సిబ్బంది చేతుల నుంచి కింద జారి పడింది. పెళ్లికొడుకు, పెళ్లి కూతురితో పాటు అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఏంట్రా బాబు.. అంత పెద్ద కేక్ ఆర్డర్ (Cake order) ఇస్తే ఇలా చేశారని ఆశ్చర్యపోయారు. పాపం వధూవరులు కిందపడ్డ కేక్ వంక దీనంగా చూస్తూ ఉండిపోయారు. 

Also Read : RRR Hindi trailer హిందీ ఆడియెన్స్‌కి నచ్చలేదా ? RRR making గురించి దారుణంగా comments

ఇంతలోనే హోటల్ సిబ్బంది వారిని ఆశ్చర్యపరుస్తూ మరో పెద్ద కేక్‌ను తీసుకొచ్చారు... అప్పుడు ఆ వధూవరులకు (bride and groom) అసలు విషయం అర్థమైంది. ఓహ్‌.. ఇదంతా ప్రాంక్ ఆ.. అనుకున్నారు. ఆ జంటను సరదాగా ఆటపట్టించేందకే హోటల్ యాజమాన్యం ఇలా ప్లాన్ చేసి మరీ ప్రాంక్ (Prank) చేసింది. ఇక తర్వాత వచ్చిన ఒరిజనల్ కేక్‌ను ఆ నవజంట కట్ చేస్తూ.. డ్యాన్స్ చేసింది. అక్కడున్న వారంతా అది తింటూ.. పెళ్లికొడుకు, పెళ్లి కూతురుకు తినిపిస్తూ పార్టీని ఎంజాయ్ చేశారు.

 

Also Read : Pushpa Pre Release Event: ‘పుష్ప’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు రంగం సిద్ధం.. వేడుక ఎప్పుడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ఇప్పుడు ఈ ప్రాంక్ కేక్ వీడియో (Prank cake video) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి ఆ నూతన దంపతులను భలే ఆటపట్టించారుగా అంటూ సోషల్ మీడియాలో (Social media) కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు. ఈ ప్రాంక్ వీడియోను లండన్‌లోని ఓ పెళ్లి వేడుకలో తీశారు. షీ షెడ్ ఎస్ అనే ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) అకౌంట్ ద్వారా పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

Also Read : 

 

Trending News