Viral Video today: ప్రేమ పేరుతో అమ్మాయిలే కాదు.. ఆడ సింహాలు కూడా మోసం చేస్తాయి.. ఈ వీడియో చూడండి..

Trending video: ప్రేమ ముసుగులో అమ్మాయిలు అబ్బాయిలను మోసం చేయడం చూశాం. కానీ ఆడ సింహం మగసింహాన్ని మోసం చేయడం చూశారా? చూడకపోతే ఈ వీడియో  చూసేయండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 5, 2024, 08:24 PM IST
Viral Video today: ప్రేమ పేరుతో అమ్మాయిలే కాదు.. ఆడ సింహాలు కూడా మోసం చేస్తాయి.. ఈ వీడియో చూడండి..

Lion Video viral: లవ్ పేరుతో అమ్మాయిలే కాదు.. ఆడ సింహాలు కూడా మోసం చేస్తాయని ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. ఇందులో ఓ మగ సింహం హాయిగా కూర్చుని జంతువు మాంసం తింటూ ఉంటుంది. ఎవరినీ దగ్గరికీ రానివ్వదు. దానిని గమనించిన ఓ ఆడ సింహం ఎలాగైనా ఆ మాంసాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. దాని కోసం ఓ స్కెచ్ వేస్తోంది. మగ సింహాన్ని ప్రేమిస్తున్నట్లు నటిస్తోంది. దాని దగ్గరకు వెళ్లి ముద్దాడుతూ ప్రేమ ఒలకబోస్తుంది. దాని లవ్ నిజమని మగ సింహం నమ్ముతోంది. అదే అదునుగా భావించిన ఆడ సింహం ఒక్కసారిగా మగ సింహం నోటి దగ్గర ఉన్న మాంసాన్ని లాక్కుని పరుగెడుతోంది. 

దాంతో మేల్ సింహం షాక్ తింటుంది. పిల్ల పోయే, మాంసం పోయే అనుకుంటూ మగసింహం దాని వెంట పడింది. అయితే మాంసం బరువుగా ఉండటం వల్ల దానిని ఆడ సింహం ఎక్కువ దూరం తీసుకెళ్లలేకపోయింది. చివరకు ఆ మాంసం మగసింహానికే దక్కింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను లేటెస్ట్ సైటింగ్స్‌ అనే ప్రముఖ వైల్డ్ లైఫ్ యూట్యూబ్ ఛానెల్( Wild Life ) షేర్ చేసింది. నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోకు వేలల్లో వ్యూస్, లక్షల్లో లైక్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 

Also Read: Viral News: ఇదేంది సారూ... పీకల దాక తాగి స్కూల్ కు వచ్చిన ఉపాధ్యాయుడు.. వైరల్ గా మారిన వీడియో..

ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా ఇట్టే వైరల్ అయిపోతుంది. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ప్రేమ ముసుగులో మగ సింహాన్ని ఆడ సింహం మోసం చేసిన వీడియో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. మీరు ఓ లుక్కేయండి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News