Viral Video: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ గర్బా స్టెప్పులు..వీడియో వైరల్..!

Viral Video: గుజరాత్‌లో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈసందర్భంగా నేతల స్టెప్పులు అలరించాయి. ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. 

Written by - Alla Swamy | Last Updated : Oct 2, 2022, 08:09 PM IST
  • గుజరాత్‌లో శరన్నవరాత్రి ఉత్సవాలు
  • డ్యాన్స్ చేసిన పంజాబ్ సీఎం
  • వీడియో వైరల్‌
Viral Video: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ గర్బా స్టెప్పులు..వీడియో వైరల్..!

Viral Video: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ గర్బా స్టెప్పులు ఆకట్టుకున్నాయి. స్టేజీపై ఆయన వేసిన డ్యాన్స్‌ అందర్నీ కట్టిపడేసింది. ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. గుజరాత్‌లోని రాజ్‌ కోట్‌లో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగా వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో పంజాబ్ సీఎం మాన్ పాల్గొన్నారు. ఈసందర్బంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నేతలతోపాటు ప్రజలు సైతం భారీగా పాల్గొన్నారు.

ఈసమయంలో భగవంత్‌ మాన్‌ డ్యాన్స్ వేయాలంటూ అభిమానులు, భక్తులు కోరారు. దీంతో వారి అభ్యర్థన మేరకు ఆయన స్టెప్పులు వేశారు. వేదికపైనే గర్బా నృత్యం చేశారు. ఆపై పంజాబీ నృత్యమైన బాంగ్రా డ్యాన్స్‌ సైతం చేశారు. ఆ దృశ్యాలను కొందరు ఫోన్‌లో చిత్రీకరించారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన కాసేపట్లో వీడియో వైరల్‌గా మారింది. పంజాబ్ సీఎం డ్యాన్స్‌కు ఫిదా అవుతున్నారు. 

గుజరాత్‌లో శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గా మాతను కొలుస్తూ సంప్రదాయ నృత్యమైన గర్బా చేస్తారు. ఆప్‌ ఎంపీ రాఘవ్ చద్దా కూడా తన డ్యాన్స్‌తో అలరించారు. వడోదరాలో జరిగిన కార్యక్రమంలో స్టెప్పులు వేశారు. 

Also read:CM Kcr: టీఆర్ఎస్‌నే బీఆర్ఎస్‌గా మారుస్తున్నారా..? సీఎం కేసీఆర్ మదిలో ఏముంది..?

Also read:Cooking Oil: దేశంలో దిగొస్తున్న వంట నూనెల ధరలు..కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News