Crocodile eating an other Crocodile: ఒక పామును మరొక పాము తినడం ఎన్నోసార్లు చూసే ఉంటారు. ఎందుకంటే అది సర్ప జాతిలో చాలా సర్వసాధారణం. కానీ ఒక మొసలి మరో మొసలిని తినడం ఎప్పుడైనా చూశారా ? చూడకపోవడమే కాదు.. ఎప్పుడూ, ఎక్కడా విని ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా అరుదైన విషయం. ఏంటి ? మొసలిని మొసలి తినడమా ? ఇది నిజమేనా అని అనుకుంటున్నారా ? అవును.. మీరు విన్నది నిజమే. మొసలిని మొసలి తింటుంది. కాకపోతే అది ఆకలిగా ఉండి దానికి ఏ ఆహారం దొరకనప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది. సాధ్యమైనంత వరకు నీళ్లలో ఉండే చేపలు, పాములు, ఏదీ దొరక్కపోతే చివరకు కప్పలు అయినా తింటాయి కానీ ఒక మొసలి మరో మొసలి జోలికి వెళ్లదు. కానీ ఎంతకీ తినడానికి ఏ ఆహారం దొరక్కపోతే మాత్రం ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మరో మొసలిని తినేందుకు అయినా వెనుకాడదు.
అయితే మొసలిని మొసలే తినాల్సి వచ్చినప్పుడు అవి పెద్ద సైజ్ మొసళ్లను తినవు. ఎందుకంటే సైజులో భారీగా ఉండటం మాత్రమే కాదు.. వాటిని వేటాడి తినడం కూడా కష్టమే. ఎందుకంటే పెద్ద సైజు మొసలి ప్రతిఘటిస్తుంది కనుక. అంతేకాకుండా సైజ్ పరంగానూ పెద్ద మొసలిని మరొ ఇంకో మొసలి తినలేదు కనుక. కానీ చిన్న సైజు మొసలిని పెద్ద సైజ్ మొసలి వేటాడం తేలిక అవుతుంది. అంతేకాకుండా అవి తినడంలోనూ ఏ ఇబ్బంది ఉండవు. ఎందుకంటే ఒక చిన్న మొసలి పెద్ద మొసలితో ప్రతిఘటించలేదు కనుక.
సౌత్ ఆఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్కులో ఈ అరుదైన దృశ్యం కనిపించింది. మార్సి జాకబ్స్, స్టీఫెన్ కంగిస్సర్ ల కెమెరాకు ఈ రేర్ వీడియో చిక్కింది. గతేడాదే యూట్యూబ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో తాజాగా ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. ఇప్పటివరకు ఈ వైరల్ వీడియోకు 26.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook