Bride and groom fighting: పెళ్లి మండపంలోనే జుట్టుపట్టుకొని పిచ్చకొట్టుడు కొట్టుకున్న వధూవరులు.. వీడియో వైరల్

Bride and groom fighting Video: ఈమధ్య కాలంలో పెళ్లిళ్లలో ముద్దు మురిపాలు అందరి ముందే కానిస్తూ వధూవరులు తమకు కాబోయే జీవిత భాగస్వామిపై ఇష్టాన్ని ప్రదర్శిస్తున్నారు. అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం తరచుగా చూస్తున్నదే. కానీ ఈ జంటకు మాత్రం జీవితంలో పెళ్లి పేరెత్తితేనే కడుపు మండిపోయేలా చేదు అనుభవం ఎదురైంది.

Written by - Pavan | Last Updated : Dec 16, 2022, 07:50 AM IST
  • ఆనందంగా సాగిపోతున్న పెళ్లి వేడుకలో ఊహించని పరిణామం
  • అబ్బాయి మొరటు తనం చూసి ఘాటుగా స్పందించిన అమ్మాయి
  • పబ్లిగ్గా అవమానిస్తావా అంటూ శివాలెత్తిపోయిన వరుడు
  • క్షణాల్లో రసాబాసగా మారిన వివాహ వేడుక.. వీడియో వైరల్
Bride and groom fighting: పెళ్లి మండపంలోనే జుట్టుపట్టుకొని పిచ్చకొట్టుడు కొట్టుకున్న వధూవరులు.. వీడియో వైరల్

Bride and groom fighting Video: పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు కొందరు. సాధారణంగా జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చే వేడుక కావడంతో అది కన్నుల పండుగగా ఉండాలనే ఎవ్వరైనా కోరుకుంటారు. పెళ్లి తంతులో ప్రతీ క్షణం ఒక మధుర క్షణం కావాలని.. ఆ క్షణాలు జీవితాంతం గుర్తుండిపోవాలని ఆశిస్తారు. పెళ్లికి ఉన్న ప్రత్యేకత, ప్రాధాన్యత అలాంటిది. కానీ ఇదిగో ఈ వీడియోలో కనిపిస్తున్న వారికి మాత్రం పాపం పెళ్లి తంతు కాస్తా పిడిగుద్దులకు, ముష్టి యుద్ధానికి వేదికైంది. 

ఇటీవల కాలంలో మనం చూస్తున్న చాలా పెళ్లిళ్లలో వధూవరులు ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను పబ్లిగ్గానే చాటిచెబుతున్నారు. ముద్దు మురిపాలు అందరి ముందే కానిస్తూ తమకు కాబోయే జీవిత భాగస్వామిపై ఇష్టాన్ని ప్రదర్శిస్తున్నారు. అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం తరచుగా చూస్తున్నదే. కానీ ఈ జంటకు మాత్రం జీవితంలో పెళ్లి పేరెత్తితేనే కడుపు మండిపోయేలా చేదు అనుభవం ఎదురైంది. ఇంతకీ ఏం జరిగింది, ఏంటా చేదు అనుభవం మీరే చూడండి.

అదండీ సంగతి. చూశారు కదా.. పెళ్లి వేడుక అప్పటివరకు హాయిగా జరిగిపోతోంది. అంతా స్రవ్యంగా జరిగిపోతోందిలే అని అనుకుంటున్న తరుణంలోనే జరగకూడని సీన్ జరిగిపోయింది. వధూవరులు పరస్పరం స్వీట్స్ తినిపించుకునే ఘట్టం అది. వధువుకు స్వీట్ తినిపించే క్రమంలో వరుడు కాస్త మొరటుతనం చూపించుకున్నాడు. అమ్మాయికి బలవంతంగా స్వీట్ నోట్లో వేసే కుక్కేశాడు. వరుడిని ఆపేందుకు అమ్మాయి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో అమ్మాయికి ఒళ్లు మండిపోయింది. అదే కోపంతో అబ్బాయిపై చేయి చేసుకుంది. వధువు నుంచి ఊహించని రిప్లై రావడంతో షాకైన వరుడు.. పబ్లిగ్గానే తనపై చేయిచేసుకుంటావా అంటూ తిరిగి కాస్త గట్టిగానే రెండు ఇచ్చాడు. ఈసారి వధువుకు మరింత కోపం కట్టలు తెంచుకుంది. పెళ్లి మండపం అని కూడా చూడకుండా అతడికి దేహశుద్ధి చేసినంత పని చేసింది. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు పరస్పరం దాడి చేసుకోవడమే కాకుండా.. జుట్టు పట్టి లాక్కున్నారు. 

వేదికపైనే నిలబడిన బంధువులు, మిత్రులు వధూవరులను ఆపేందుకు ఎంత ప్రయత్నించినా వారు వినిపించుకోలేదు. తూ కిత్తారే.. అంటే తూ కిత్తారే అన్నట్టుగా కసి తీరా కొట్టుకున్నారు. ఒక ట్విటర్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వైరల్ వీడియోకు భారీ స్పందన లభిస్తోంది. వీడియో చూసిన నెటిజెన్స్ తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు. వధూవరులు కొట్టుకుంటున్న తీరు చూసి " వీళ్లు పెళ్లి చేసుకుంటున్నారా ? లేక డైవర్స్ తీసుకుంటున్నారా " అర్థం కావడం లేదంటూ సెటైర్స్ వేస్తున్నారు.

ఇది కూడా చదవండి : Vahan Puja For Helicopter: యాదాద్రిలో అరుదైన దృశ్యం.. హెలీక్యాప్టర్‌కి వాహన పూజలు, వీడియో వైరల్

ఇది కూడా చదవండి : Funny Memes: ఢిల్లీ ఎయిర్ పోర్టులో పరిస్థితిపై ఫన్నీ మీమ్స్ వైరల్.. చూసి నవ్వకుంటే ఒట్టు

ఇది కూడా చదవండి : Waltair Veerayya: వాల్తేరు వీరయ్య నుంచి వీడియో లీక్ చేసిన చిరు.. మాములుగా లేదుగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News