Train in Fields Viral Video: సాధారణంగా రైలు పట్టాలపై వెళ్తుంది. వాహనాలకు రోడ్డుమార్గం మాదిరి రైలుకు రైలు పట్టాలు ఉంటాయి. ఈ ఇనుమ పట్టాలపై మాత్రమే రైళ్లన్ని ప్రయాణం చేస్తాయి. అయితే, ఈ మధ్య కాలంలో రైలు ప్రమాదాలు సంబంధించి చాలా వార్తలే విన్నాం. ముఖ్యంగా మొన్న సిమెంట్ దిమ్మెను సైతం రైలు పట్టాలకు అడ్డం పెట్టారు. ఇలాంటి ఘటనే అంతకు ముందు కూడా జరిగింది. ఇదిలా ఉండగా ఈసారి ఓ ట్రైన్ మాత్రం పట్టాలపై కాకుండా పంటపొలాల్లో నడిచి వైరల్ అవుతుంది. మీరు ఓ లుక్ వేయండి మరి...
ప్రస్తుతం ఈ ట్రైన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఎక్స్‌లో పోస్టు చేసిన ఈ వీడియోలో ట్రైన్ ఇంజిన్ పట్టాలపై కాకుండా పక్కనే ఉన్న పంటపొలాల్లో నడిచింది. ఈ వైరల్ ఘటన బిహార్‌లోని గయాలో చోటు చేసుకుంది. ఈ వీడియోలో మాములు ట్రైన్ మాదిరి రైటు పట్టాలపై కాకుండా పంటపొలాల్లోకి వెళ్లింది. ఈ ఘటన శనివారం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
మామూలు ట్రైన్లు అయితే, మాత్రం ప్యాసింజర్ లేదా గూడ్స్ రైలు అయినా ముందు ఇంజిన్ ఉంటుంది. దీంతోపాటు వెనుక బోగీలను ఈ ఇంజిన్ లాక్కెల్తుంది. కానీ, ఈ వీడియోలో మాత్రం కేవలం ఇంజిన్ మాత్రమే కనిపిస్తోంది. అయితే, పంటపొలాల్లో నడిచిన ఈ రైలు ఎంతదూరం వెళ్లలేదు కాసేపు ప్రయాణించి అక్కడే ఆగిపోయింది. అది బారికేడ్ విరగగొట్టి మరీ దూసుకెళ్లింది. అంతేకాదు కాస్త దగ్గరగా చూస్తే ఇంజిన్ పక్కనే ఉన్నా మరో పట్టాలపై వెళ్లినట్లు కనిపిస్తుంది కానీ, దాన్ని దాటి మరీ పొలాల్లో కాస్త దూరం వెళ్లింది.
ఇదీ చదవండి: శనిదేవుడు వల్ల 2027 వరకు ఈ రాశులకు కష్టాలే ఉండవు.. సంపదల వర్షంతో రాజభోగాలు..!
ఈ దృశ్యం చూసి అక్కడే పంటపొలాల్లో ఉన్నవారు ఆశ్చర్యానికి గురైనారు. రైలేంటి పట్టాలు కాకుండా పొలాల్లో నడుస్తుందని ఈ వైరల్ వీడియోను తమ ఫోన్లలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, అదృష్టవశాత్తు కేవలం ఇంజిన్ మాత్రమే పట్టాలు తప్పి పంట పొలాల్లోకి వెళ్లింది ఒకవేళ ప్రయాణీకుల బోగీలతోపాటు పట్టాలు తప్పితే మాత్రం పరిస్థితి డేంజర్‌గా ఉండేది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై రైల్వే అధికారులు ఆరాతీస్తున్నారు. అసలు ఎలా ఇలాంటి ఘటన జరిగిందని ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు.
पटरी से उतरती भारतीय रेल...
अबकी,, बिहार में गया के किउल रेल लाइन पर वज़ीरगंज स्टेशन और कोल्हना हाल्ट के बीच रघुनाथपुर गांव की बारी थी! pic.twitter.com/hiLUkYC1Uq— SumanMishra - सुमन मिश्रा (@sumanmishraa) September 15, 2024
ఇదీ చదవండి: వృషభరాశిలో బృహస్పతి.. ఈ రాశులకు ధన వర్షం రెట్టింపు ఆదాయం
అయితే, మొన్న ఈ మధ్యే మగధ ఎక్స్‌ప్రెస్ కూడా కప్లింగ్ ఊడిపోయి రైలు రెండుగా విడిపోయింది. ఈ ఘటన ఈ నెల 8వ తేదీన బక్సర్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే, ఈ ఘటనో రైలు ప్రయాణీకులకు ఏ ప్రమాదం జరగకుండా లోకోపైలట్ అప్రమత్తయ్యారు కాబట్టి ఎటువంటి దుర్ఘటన జరగలేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitterమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి