Watch viral video: రిపోర్టర్ లైవ్‌లో ఉండగా శునకం వచ్చి మైక్ ఎత్తుకెళ్తే ?

Hilarious incident caught on camera goes viral: టీవీ రిపోర్టర్ లైవ్‌లో ఉండగా అనుకోకుండా అక్కడ ఏదైనా జరిగి ఆ రిపోర్ట్ అర్ధాంతరంగా ఆగిపోవడం, లేదా ఆ ఘటన హాస్యాస్పదంగా ఉంటే ఆ లైవ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి దృశ్యాలు గతం మీరు ఎన్నో చూసుంటారు. కానీ ఆ తరహా వీడియోల్లో ఇంత ఫన్నీ వీడియో (Funny video) మాత్రం ఇంతకుముందు చూసుండరు... లేదా ఇలా కూడా జరుగుతుందా అని ఊహించి ఉండరు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 5, 2021, 08:01 PM IST
Watch viral video: రిపోర్టర్ లైవ్‌లో ఉండగా శునకం వచ్చి మైక్ ఎత్తుకెళ్తే ?

Hilarious incident caught on camera goes viral: టీవీ రిపోర్టర్ లైవ్‌లో ఉండగా అనుకోకుండా అక్కడ ఏదైనా జరిగి ఆ రిపోర్ట్ అర్ధాంతరంగా ఆగిపోవడం, లేదా ఆ ఘటన హాస్యాస్పదంగా ఉంటే ఆ లైవ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి దృశ్యాలు గతం మీరు ఎన్నో చూసుంటారు. ఇప్పుడు మేము మీకు చూపించబోతున్న వీడియో కూడా అలాంటిదే. కానీ ఆ తరహా వీడియోల్లో ఇంత ఫన్నీ వీడియో (Funny video) మాత్రం ఇంతకుముందు చూసుండరు... లేదా ఇలా కూడా జరుగుతుందా అని ఊహించి ఉండరు. ఒక టీవీ రిపోర్టర్ లైవ్‌లో ఉండి రిపోర్టింగ్ చేస్తుండగా వారి చేతిలో ఉన్న మైక్రోఫోన్‌ని శునకం వచ్చి ఎత్తుకెళ్తే ఎలా ఉంటుంది ? ఏంటి ఇలా కూడా జరుగుతుందా అని అనుకుంటున్నారా ? కానీ అచ్చం అలాగే జరిగింది. నమ్మలేకపోతే ఇదిగో ఈ వీడియో చూసేయండి.. మిగతా విషయాలు తర్వాత చెప్పుకోవచ్చు.

ఈ వీడియోలో కనిపిస్తున్న జర్నలిస్ట్ పేరు నడెజ్దా సెరెకినా (Mir TV journalist Nadezhda Serezhkina's funny video). రష్యాలో మిర్ అనే టీవీ ఛానెల్‌లో వెదర్ రిపోర్టర్. తన విధుల్లో భాగంగా తాజాగా వెదర్ రిపోర్టింగ్ చేస్తుండగా.. అప్పుడే అటుగా వచ్చిన లాబ్రాడార్ (Labrador Retriever) జాతి శునకం ఆమె చేతిలోని మైక్రోఫోన్‌‌ని ఎగిరి నోట కరుచుకుని అక్కడి నుంచి పరుగులు తీసింది. ఊహించని పరిణామానికి ఒక్కసారిగా షాక్ అయిన రిపోర్టర్.. తన మైక్రోఫోన్ కోసం శునకం వెంట పరుగులు తీయకతప్పలేదు. 

Also read : Bike Stunts viral video: బైక్ స్టంట్స్ చేయబోయాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి

అదృష్టంకొద్దీ కొద్దిదూరంలోనే ఆమె ఆ శునకాన్ని పట్టుకుని తన మైక్ తాను తీసుకుంది. 

ఈ ఘటనకు తనకు కానీ లేదా శునకానికి కానీ ఏమీ కాలేదని... కాకపోతే తన మైకుకే ఒకట్రెండు గాట్లు పడ్డాయని చెబుతూ మళ్లీ తన పని తాను పూర్తి చేసింది. స్టూడియోలో ఉండి ఇదంతా చూస్తున్న టీవీ ప్రజెంటర్.. అతికష్టంమీద తన పని తాను పూర్తి చేసింది. 

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఘటనపై నెటిజెన్స్ రకరకాలుగా స్పందించారు. ఆ వైరల్ వీడియోపై తమదైన స్టైల్లో ఫన్నీ కామెంట్స్ పోస్ట్ చేస్తూ రిట్వీట్స్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఈ ఫన్నీ వైరల్ వీడియో మరింత వైరల్ (Viral video) అయ్యింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News