Beggar Buy Bike: భార్యకు ప్రేమతో.. 90 వేల బైక్‌ కొన్న బిచ్చగాడు! రోజువారీ సంపాదన తెలిస్తే షాకే

Beggar Buys Moped motorcycle worth Rs 90 in Madhya Pradesh. ఓ బిచ్చగాడు తన భార్య కోసం ఏకంగా రూ. 90 వేల మోపెడ్ మోటార్‌ సైకిల్‌ను కొన్నాడు. ఇందుకోసం నాలుగేళ్లుగా కస్టపడి పైసాపైసా కూడబెట్టాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 25, 2022, 06:05 PM IST
  • 90 వేల బైక్‌ కొన్న బిచ్చగాడు
  • రోజువారీ సంపాదన తెలిస్తే షాకే
  • భార్య చికిత్స కోసం 50 వేలు
Beggar Buy Bike: భార్యకు ప్రేమతో.. 90 వేల బైక్‌ కొన్న బిచ్చగాడు! రోజువారీ సంపాదన తెలిస్తే షాకే

Beggar Buys Moped motorcycle worth Rs 90k after his wife gets backache in Madhya Pradesh: సాధారణంగా ప్రతి భర్త తన భార్యకు బహుమతులు ఇస్తుంటారు. పెళ్లిరోజు లేదా పుట్టిన రోజు లాంటి ప్రత్యేక సందర్భాల్లో ఖరీదైన గిఫ్ట్స్ ఇస్తారు. బాగా దబ్బున్న వారు అయితే పెద్దపెద్ద బహుమతులు ఇస్తారు. అయితే ఓ బిచ్చగాడు తన భార్య కోసం ఏకంగా రూ. 90 వేల మోపెడ్ మోటార్‌ సైకిల్‌ను కొన్నాడు. ఇందుకోసం నాలుగేళ్లుగా కస్టపడి పైసాపైసా కూడబెట్టాడు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో ఓ బిచ్చగాడు చేసిన ఈ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

చింద్వారాలోని అమరవార గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ సాహు అతని భార్య మున్ని భిక్షాటన చేస్తూ జీవిస్తునారు. సంతోష్‌కు అంగ వైకల్యం ఉన్న కారణంగా అతడు కాళ్ళు కదపలేడు. దాంతో సతీమణి మున్ని సాయంతో.. ఓ ట్రైసైకిల్‌పై ప్రయాణిస్తూ బిక్షాటన చేసేవాడు. సంతోష్ ట్రైసైకిల్‌పై కూర్చుంటే.. మున్ని సైకిల్‌ తోసేది. వృద్ధాప్యంలో ఉన్న అతని భార్య చెడు వాతావరణ పరిస్థితులు (వర్షం, ఎండ) మరియు అధ్వాన్నమైన రోడ్ల కారణంగా చాలా బాధపడేది. ఆమె పదే పదే అనారోగ్యానికి గురవుతుండేది. 

ఇటీవల సంతోష్‌ భార్య మున్ని తీవ్ర అనారోగ్యానికి గురైంది. తన భార్య చికిత్స కోసం అతడు 50 వేల రూపాయలు ఖర్చు చేశాడు. చికిత్స అనంతరం మున్ని కోలుకున్నా.. బలహీనంగా తయారైంది. వెన్ను నొప్పి కూడా ఎక్కువైంది. దాంతో ఆమె ట్రైసైకిల్‌ని తోయలేకపోయింది. భార్య కష్టం చూడలేక చలించిపోయిన సంతోష్.. తన భార్య కోసం ఓ బైక్‌ కొనాలకున్నాడు. నాలుగేళ్లుగా కస్టపడి పోగు చేసిన 90 వేల రూపాయలతో మోపెడ్ మోటార్‌ సైకిల్‌ను కొని తన భార్య మున్నికి బహుమతిగా ఇచ్చాడు. దాంతో ఇద్దరం కలిసి హాయిగా బైక్‌పైనే వెళ్లి భిక్షాటన చేస్తున్నారు. 

సంతోష్‌ మీడియాతో మాట్లాడుతూ... 'మోటార్‌ సైకిల్‌ రాకతో నా భార్యకు ట్రైసైకిల్‌ తోయాల్సిన అవసరం ఇక లేదు. ఇద్దరం కలిసి బైక్‌పైనే వెళ్లి భిక్షాటన చేస్తున్నాం. ఇద్దరం కలిసి సియోని, ఇటార్సి, భోపాల్, ఇండోర్‌లకు కూడా వెళ్లొచ్చు. సంతోషంగా ఉంది' అని అన్నాడు. బైక్ కొన్న తర్వాత బిచ్చగాడు సంతోష్‌ వెళ్లి తనకు సాయం చేసిన వారికి స్వీట్స్ ఇచ్చాడు. అందరికీ కృతజ్ఞతలు కూడా చెప్పాడు.

బిచ్చగాడు సంతోష్ తన భార్య కోసం చేసిన ఈ మంచి పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చింద్వారాలో బిచ్చగాడు చేసిన ఈ పని గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. భార్యపై ప్రేమ చూపిన సంతోష్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. 'ఎప్పటికీ కలలు కనడం ఆపవద్దు.. దాని కోసం పని చేస్తూ ఉండండి', 'నిజమైన ప్రేమకు నిర్వచనం ఇదే', 'గ్రేట్ థింగ్.. హ్యాట్స్ ఆఫ్', 'భార్యకు ప్రేమతో', 'మంచి భర్త' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: LSG vs RCB Eliminator: ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజయం వారిదే.. కారణం ఏంటో తెలుసా?

Also Read: Jos Buttler IPL Record: జోస్ బట్లర్‌ రేర్ రికార్డు.. ఒకే సీజన్‌లో..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News